Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




క్రీస్తు మహిమకు మూలము

(ప్రసంగము సంఖ్య 14 యెషయా 53)
THE SOURCE OF CHRIST’S GLORY
(SERMON NUMBER 14 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము ఉదయము, ఏప్రిల్ 21, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 21, 2013

"కావున గొప్ప వారితోనే అతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకోనును; ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధార పోసెను: అతి క్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను; అనేకుల పాపమును భారించుచు, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపము చేసెను" (యెషయా 53:12).


జాన్ ట్రేప్ ఒక పురిటాన్ బోధకుడు 17వ శతాబ్దంలో (1601-1669) జీవించాడు. చెప్పబడింది ఆయన "చాలా కృషీవలుడు విశిష్ట బోధకుడు. [అతని] పేరు పూర్తి బైబిలును వ్యాఖ్యానించిన దాని బట్టి చెప్పవచ్చు, [ఉదాహరణ ఇస్తుంది] అతని పురిటాన్ బైబిలు స్టడీ శ్రేష్టము; అది పరిహాసం ప్రగాఢ విజ్ఞానం మిలితము" (Elgin S. Moyer, Ph.D., Who Was Who in Church History, Keats Publishing, 1974, p. 410). ట్రేప్స్ వ్యాఖ్యానము స్పర్జన్ చే సిఫారసు చేయబడింది. యెషయా 53 వ అధ్యాయాన్ని గూర్చి, జాన్ ట్రేప్ అన్నాడు,

ఇక్కడ ప్రతి మాటకు విలువ ఉంది, కచ్చితమైన విషయం అపోస్తలులు సువార్తికులు, రక్షణ మర్మాలు వివరించడంలో, యెషయా లోని అధ్యాయ మంతటికి గొప్ప గౌరవము కలిగియున్నారు...ప్రవక్త ఈ విషయాలు రాస్తున్నప్పుడు, గొప్ప ఆత్మతో నింపబడ్డాడు, ఎందుకంటే ఇక్కడ ఆయన యేసు క్రీస్తు ప్రభువును ద్విముఖంగా అవమానింప బడుచున్న పై కెత్తబడుచున్న విధానాన్ని చూపించాడు, కాని వేరే [రచయితలు] పాత నిబంధనకు సంబందించిన వారు కొంత వికాసాన్ని నూతన [నిబంధన] నుండి తీసుకున్నారు, ఈ అధ్యాయము చాలా స్థలాలలో నూతనత్వానికి తావిచ్చింది (John Trapp, A Commentary on the Old and New Testaments, Transki Publications, 1997, volume III, page 410).

నిజంగా, ఈ ఉదయము మన పాఠ్యభాగము "వెలుగు నిస్తుంది" మనకు నూతన నిబంధనను లోతుగా అర్ధం చేసుకోవడానికి. నూతన నిబంధన గ్రంధము యెషయా 53 వ అధ్యాయాన్ని వివరించడం బదులు, ఇంకొక రీతిలో జరిగింది. యెషయా 53 క్రొత్త నిబంధన గ్రంధాన్ని వివరించడానికి సహాయపడింది! అది చాలా అసాదారణము.

డాక్టర్ జాక్ వారెన్ అన్నారు, మన పాఠము గురుంది, "ఈ ఆఖరి వచనము [యెషయా 53] ఒక ఆసక్తికర విషయంతో ముగుస్తుంది: రక్షకుని ఘన పరుస్తుంది ఆయన ప్రాణాన్ని అర్పించినందుకు అతి క్రమము చేయు వారితో లెక్కింప బడినందుకు" (Jack Warren, D.D., Redemption in Isaiah 53, Baptist Evangel Publications, 2004, p. 31).

"కావున గొప్ప వారితోనే అతనికి పలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకోనును; ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధార పోసెను: అతి క్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను; అనేకుల పాపమును భారించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపము చేసెను" (యెషయా 53:12).

ఇక్కడ, ఈ ఉదయం, క్రీస్తు ఆయన తండ్రీ అనుగ్రహించిన బహుమానము అనుభవిస్తున్నాడు – "కావున గొప్ప వారితో నేనటానికి పాలు పంచి పెట్టెదను." పరలోకములో ఎవ్వడూ క్రీస్తును తిరస్కరించలేదు. ఆకాశ వాసులంతా ఆయన ఘన పరుస్తారు! మహిమంతా ఆయన సింహాసనం చుట్టూ ఆవరించి ఉంటుంది, తండ్రీ కుడి పార్శ్వములో. ఈమహిమ ఘనత పొందడానికి క్రీస్తు ఏమి చేసాడు? ఎందుకు ఆయన "గొప్ప వారితో పాలు పంచుకున్నాడు, మరియు…ఘనులలో కొల్ల సొమ్ము విభాగించుకున్నాడు"? జవాబు ఆయన నాలుగు పనులు చేసాడు.

I. మొదటిది, మరణము నొందునట్లు అతను తన ప్రాణమును ధార పోసెను.

"మరణము నొందునట్లు అతను తన ప్రాణమును ధార పోసెను…" (యెషయా 53:12).

క్రీస్తు ఉద్దేశపూర్వకంగా చేసింది. అతను ఆలోచన మరియు జాగ్రత్తగా చేసింది, అకస్మాత్తుగా భావోద్వేగ ప్రేరణ ద్వారా కాదు. కావాలని మరణము నొందునట్లు అతడు తన ప్రాణము ధారపోసెను, కొద్ది కొద్దిగా, మొత్తం ఖాళీ అయ్యేంత వరకు చేసి, ఏడ్చాడు,

"సమాప్తమైన దాని చెప్పి: తలవంచి, ఆత్మను అప్పగించెను" (యోహాను 19:30).

గుర్తుంచుకొండి దీనిని క్రీస్తు స్వచ్చందంగా చేసాడు. ఆయన అన్నాడు,

"నేను నా ప్రాణము వదిలి పెట్టుచున్నాను... ఎవడును నా ప్రాణమును తీసికొనడు, నా అంతట నేనే దానిని వదిలి పెట్టుచున్నాను" (యోహాను 10:17).

ఇది ప్రాముఖ్య విషయం. మనం అర్ధం చేసుకోవాలి యేసు హఠాత్తుగా చనిపోలేదని. బుద్ధి పూర్వకంగా మరణించాడు; ఇష్ట పూర్వకంగా తన ప్రాణాన్ని మన పాప పరిహారార్ధం ఇచ్చాడు. "మరణము నొందునట్లు అతడు తన ప్రాణము ధారపోసెను" సిలువపై, చెయ్యవలసి ఉంది కాదు, కాని నీ కొరకు, నా కొరకు – ఆయనను నమ్మిన వారందరి రక్షణార్ధం.

ఆయనను నమ్ము, తరువాత, వెనుకకు తిరుగవయ్య. నీ యొక్క ప్రాణాన్ని అర్పించు, పూర్తిగా విశ్వసించి, ఆయన తన ప్రాణాన్ని మరణానికి అప్పగించినట్లు నీ కొరకు. వచ్చి, క్రీస్తులో విశ్రమించు, అప్పుడు నువ్వు చూస్తావు ఆయన ఎందుకు ఘనతా మహిమలతో కిరీటింపబడ్డాడో. ఆయనకు గౌరవప్రద స్థానం ఉంది ఎందుకంటే ఆయన

"మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అవినీతి మంతుల కొరకు, నీతి మంతుడైన క్రీస్తు శరీరంలో శ్రమపడెను" (I పేతురు 3:18).

సిలువపై ఆయన మరణము, ఎంత అవమానము తెచ్చిందో, అంత ఘనత మహిమ తెచ్చింది "గొప్ప వారితో పాలు పంపులు," మరియు "ఘనులలో కొల్ల సొమ్ము." అలా, దేవుడు అతనికి యిచ్చాడు "అన్యులను [ఆయన] స్వస్తంగా" (కీర్తనలు 2:8). అలా, దేవుడు అన్నాడు, "నేను ఆయనకు యిస్తాను జయించడానికి, చేధించడానికి, దురాత్మలను వెల్ల గొట్టడానికి...దానికి ఆయనకు బహుమానం ఉంటుంది [అవమానముతో] కూడిన మరణాన్ని పొందినందుకు" (ట్రాప్, ఐబిఐడి.). (Trapp, ibid.).

"ఆయన ప్రధానులను అధికారులను నిరాయు దులనుగా చేసి, సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి, భాహటంగా వేడుకకు కనుపరచెను" (కోలోస్సీ 2:15).

"మరణపు శక్తులు." పాడండి!

మరణపు శక్తులు బహు చెడు జరిగించాయి,
     కాని క్రీస్తు వాటిని చెదర గొట్టాడు:
పరిశుద్ధ ఉత్సాహ ధ్వని చేద్దాం. హల్లెలూయా!
     హల్లెలూయా! హల్లెలూయా! హల్లెలూయా!
(“The Strife is O’er” translated by Frances Pott, 1832-1909).

ఆయనకు మహిమ ఘనతలు ఇవ్వబడ్డాయి ఎందుకంటే ఆయన ప్రాణార్పము చేసుకున్నాడు పాపులను రక్షించడానికి. రండి, ఆయనను నమ్మండి! రండి, ఆయనను పూర్తిగా నమ్మండి! రండి, ఆయనను పూర్తిగా నమ్మండి!

II. రెండవది, ఆయన పాపులతో లెక్కింపబడెను.

"కావున గొప్ప వారితోనే అతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకోనును; ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధార పోసెను: అతి క్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను…" (యెషయా 53:12).

క్రీస్తు పాపులతో లెక్కింపబడెను. ఆయన ఇహలోక పరిచర్య అంతటిలో, పాపులతో కలిసి జీవించాడు. అది పరిశయ్యల ప్రధాన విమర్శ. ఆయనను, గూర్చి వారు అన్నారు,

"సుంకరులకును పాపులకును స్నేహితుడా" (లూకా 7:34).

మరియు, ఆయన సిలువ మరణములో, ఆయన ఇద్దరు నేరస్తుల మద్య సిలువ వేయబడ్డాడు.

"అతి క్రమము చేయు వారిలో ఒకడాయెను" (యెషయా 53:12).

అంటే, వారిలో "లెక్కింపబడెను" [ఒకనిగా]. "ఆయన అతి క్రమకారుడు కాదు, కానిలా చేయబడ్డాడు దొంగలతో సిలువ వేయబడ్డాడు" (Jamieson, Fausset and Brown, volume 2, p. 733). మార్కు సువార్త అంటుంది,

"మరియు ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి; కుడి వైపున ఒకడును, ఎడమ వైపున ఒకడును. లేఖనములు నెరవేరబడినవి, ఈ విధంగా అన్నాడు, "అతి క్రమ కారులలో ఒకనిగా లెక్కింపబడెను" (మార్కు 15:27-28).

డాక్టర్ యాంగ్ అన్నాడు, "వీరు పాపులు, కాదు నేరస్తులు" (Edward J. Young, Ph.D., The Book of Isaiah, 1972, volume 3, p. 359). వారు "అతి క్రమ కారులు." గ్రీకు పదము "ఎనోమోస్," అంటే న్యాయచట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తీ (ఆయన). ఇలా, క్రీస్తు ఘోర పాపులలో ఒకనిగా ఎంచబడ్డాడు! అన్నా వాటర్ మాన్ చక్కని పాట ఇలా అంటుంది,

మీలో అతి హీనున్ని రక్షించాడు, నాలాంటి దౌర్భాగ్యుణ్ణి రక్షించినప్పుడు.
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్దులనుగా చేస్తుంది;
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్ధులను చేయును.
(“Yes, I Know!” by Anna W. Waterman, 1920).

లూకా సువార్త చెబుతుంది ఇద్దరి దొంగల్లో ఒకడు యేసును నమ్మి రక్షింపబడ్డాడు (లూకా 23:39-43). డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "ఒక దొంగ రక్షింపబడ్డాడు ఎంత భయంకర పాపియైనా నిరుత్సాహపడకుండా…” (John R. Rice., D.D., The King of the Jews, Sword of the Lord, 1980 reprint, p. 475). డాక్టర్ మెక్ గీ అన్నాడు,

అ ఇద్దరి మద్య [ఇద్దరి దొంగల] తేడా ఏమిటి? వారు ఇద్దరూ – దొంగలే. తేడా ఏంటంటే ఒక దొంగ యేసు క్రీస్తును నమ్మాడు ఒకడు నమ్మలేదు (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson, 1983, volume IV, p. 354).

"అతి క్రమ కారులలో ఒకనిగా ఎంచబడింది." ఇది తెలియ చేస్తుంది యేసు ఐచ్చికంగా భయంకర పాపుల స్థానంలో ఉన్నాడు. వారితో లెక్కింపబడ్డాడు కాబట్టి పాపులు రక్షింపబడగలరు. కాని నీవు రక్షింప బడడానికి ఆయనను నమ్మాలి.

క్రీస్తు గౌరవింపబడ్డాడు ఎందుకంటే పాపుల స్థానంలో నిలవడానికి ఒప్పుకున్నాడు, వారి పాపము ఆయనపై వేసుకున్నాడు, అలా వారు రక్షింపబడడానికి వీలు కలిగించాడు. ఇలా, ఆయన గౌరవించబడ్డాడు ఎందుకంటే "ఆయన అతి క్రమ కారులలో ఒకడాయెను." "అవును, నాకు తెలుసు!" ఈ పాట పాడండి!

నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్దులనుగా చేస్తుంది;
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్ధులను చేయును.
(“Yes, I Know!” by Anna W. Waterman, 1920).

III. మూడవది, ఆయన అనేకుల పాపమును భరించెను.

మనమందరమూ నిలబడి పాఠ్యము గట్టిగా చదువుదాం, ఆఖరి మాటలు, "అనేకుల పాపము."

"కావున గొప్ప వారితోనే అతనికి పలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకోనును; ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధార పోసెను: అతి క్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను; అనేకుల పాపమును భారించుచు..." (యెషయా 53:12).

మీరు కూర్చోండి.

"అతడు అనేకుల పాపమును భరించెను." అపోస్తలుడైన పేతురు ఇలా అన్నాడు,

"ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మొసికొనెను" (I పేతురు 2:24).

ఇదే బదులుగా రక్షణ. క్రీస్తు నీ పాపాన్ని "ఆయన శరీరములో" సిలువపై తీసుకుంటాడు. ఆయన ప్రాయాశ్చిత్తము పాపాలకు చేల్లిస్తాడు పాపాన్ని ఆయనపై వేసుకొని నీకోసం మరణించడం ద్వారా. యేసు యొక్క బదులు మరణం అనుగ్రహం లేకుండా సువార్త లేదు. ఆయన ఘోర మరణం పాపుల కొరకు అతి సువార్త సారాంశము. స్పర్జన్ అన్నాడు,

ఇప్పుడు, ఈ మూడు విషయాలు – మరణానికి ప్రాణాన్ని అప్పగించుకోవడం, పాపుల పరిహారం చెల్లించడం; అతి క్రమ కారులలో ఒకనిగా ఎంచబడడం, పాపుల పక్షంగా ఉండడం; ఆ తరువాత, వారి పాపాన్ని భరించడం...ఆయనను అపవిత్ర పరచలేదు, కాని మనుష్యులను అపవిత్ర పరిచే పాపాన్ని తొలగించడానికి దోహదపడింది – ఈ మూడు విషయాలు కారణాలు యేసు ప్రభువు మహిమ [కొరకు]. దేవుడు, ఈ మూడు విషయాలను బట్టి, ఇంకొకటి ఘనులతో కొల్ల సొమ్ము విభాగించుకోనుట, గొప్ప వారితో పాలు పంపులు పొందుట (C. H. Spurgeon, The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1975 reprint, volume XXXV, page 93).

“అవును, నాకు తెలుసు!” పాట పాడండి!

నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్దులనుగా చేస్తుంది;
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్ధులను చేయును.

IV. నాల్గవది, అతడు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను.

పాఠ్య భాగము ఈ మాటలతో ముగుస్తుంది,

"తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను" (యెషయా 53:12).

సిలువపై, పాపుల కోసం క్రీస్తు ప్రార్ధించాడు, "తిరుగుబాటు దారుల కొరకు విజ్ఞాపనము," చేసి ఇలా మోర పెట్టాడు,

"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు; గనుక వీరిని రక్షింపుము" (లూకా 23:34).

ఇలా ఆయన పాపుల కోసం ప్రార్ధించాడు సిలువపై వ్రేలాడాడు.

ఇంకా, ఇప్పుడు కూడా పరలోకంలో, యేసు పాపుల కోసం ప్రార్దిస్తున్నాడు,

"ఆయన [మన] కొరకు విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవించుచున్నాడు" (హెబ్రీయులకు 7:25).

ఆయన పాపుల కొరకు విజ్ఞాపన చేస్తూ సిలువపై మరణించాడు. నేడు కూడా పాపుల కొరకు ప్రార్ధించుట కొనసాగిస్తున్నాడు, పరలోకంలో తండ్రీ దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై.

గమనించండి యేసు చేసిన నాలుగు పనులకు కారణం ఆయన హెచ్చింపబడడానికి,తండ్రీ కుడి పార్శ్వాన కూర్చోడానికి. క్రీస్తుకు ప్రస్తుతం ఉన్న మహిమకు ఆ నాలుగు విషయాలు కారకాలు పాపులను రక్షించడానికి ఆయన చేసిన ప్రక్రియలో!

"మరియు ఆయన ఆకారమందు మనుస్యునిగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా, విధేయత చూపిన వాడై తన్ను తానూ తగ్గించుకోనేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలోకాని: ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును...ప్రతిదాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకోను నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అనుగ్రహించెను" (ఫిలిప్పీయులకు 2:8-11).

ఇంకా గమనించండి, యేసు రక్షించు శక్తితో, ఆయన రక్షించడు వారిని తమకు రక్షణ అవసరము లేదను కొనువారిని. స్పర్జన్ అన్నాడు,

[నీలో] పాపమూ లేకపోతే ఆయన [నిన్ను] కడుగలేడు. కడుగ గలడా?...నీవు చాలా మంచి వాడవైతే, గౌరవ పాత్రులైతే, మీ జీవితమంతా ఏ తప్పు చేయలేదను కుంటే; నీలు యేసు ఎవరు? బహుశా, నీ స్వంత మార్గంలో నువ్వు వెళ్తున్నావు, నీ బాగోగులు నువ్వే చూసుకున్తున్నావు...ఔరా! ఇది బ్రాంతి...నీలో నువ్వు చూసుకుంటే, నీ హృదయం నల్ల చిమ్మలా ఉంటుంది తుడువబడినది. [మీ] హృదయాలు అపవిత్ర బావులు. ఓ, ఇది చూచి, నీ అబద్దపు స్వనీతిని వదులు! [కాని] వదలకపోతే, యేసులో నీకేమి లేదు. పాపుల నుండి ఆయన మహిమను పొండుకున్నాడు, మీలాంటి స్వ-నీతి పరుల నుండి కాదు. కాని, నేరారోపణ కలవారులారా, నీ పాపారోపణ…ఒప్పుకో, నవ్వుతో గుర్తుంచుకో యేసు చేసిన నాలుగు విషయాలు, పాపులకు సంబంధించి, పాపుల కొరకు చేసాడు కాబట్టి ఈ రోజు ఆయన మహిమ ఘనతా ప్రభవములథొ కిరీటింపబడ్డాడు...[కావున] మనస్పూర్తిగా [మనవి చేస్తున్నాను] దైవ కుమారుని నమ్ము, శరీర ధారియై, అపరాదుల కోసం రక్తం కార్చాడు! నీవు ఆయనను విశ్వసిస్తే ఆయన నిన్ను మోసగించడు. నీవు రక్షింపబడుతావు, ఒకేసారి నిత్యత్వానికి రక్షింపబడతావు (స్పర్జన్, ఐబిఐడి., పేజి 95). (Spurgeon, ibid., page 95).

ఆమెన్! "అవును, నాకు తెలుసు!" ఇంకొకసారి పాడండి!

నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్దులనుగా చేస్తుంది;
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్ధులను చేయును.
(“Yes, I Know!” by Anna W. Waterman, 1920).

మీరు మాతో మాట్లాడాలనుకుంటే యేసు ద్వారా పాపాలు కడుగ బడడానికి, దయచేసి ఆవరణము వెనుక భాగానికి వెళ్ళండి. డాక్టర్ కాగన్ నిశ్శబ్ద స్థలానికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడుతారు. త్వరగా వెళ్ళండి గ్రిఫిత్ ఆ పాటను ఇంకోసారి పాడుతూ ఉండగా,

నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్దులనుగా చేస్తుంది;
నాకు తెలుసు, అవును, నాకు తెలుసు, యేసు’ రక్తము భయంకర పాపులను శుద్ధులను చేయును.

లీ గారు, ముందుకు వచ్చి స్పందించిన వారి కొరకు ప్రార్ధించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రీగ్ టాన్ ఎల్.చాన్: యెషయా 53:6-12.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే: "ఎస్, ఐ నో!" (అన్నా డబ్ల్యూ.వాటర్ మెన్ చే, 1920).
“Yes, I Know!” (by Anna W. Waterman, 1920).


ద అవుట్ లైన్ ఆఫ్

క్రీస్తు మహిమకు మూలము
(ప్రసంగము సంఖ్య 14 యెషయా 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"కావున గొప్ప వారితోనే అతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకోనును; ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధార పోసెను: అతి క్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను; అనేకుల పాపమును భారించుచు, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపము చేసెను" (యెషయా 53:12).

I.      మొదటిది, మరణము నొందునట్లు అతను తన ప్రాణమును ధార పోసెను, యెషయా 53:12ఎ; యోహాను 19:30, 10:17; I పేతురు 3:18; కీర్తనలు 2:8; కోలోస్సయులకు 2:15.

II.    రెండవది, ఆయన పాపులతో లెక్కింపబడెను, యెషయా 53:12బి; లూకా 7:34; మార్కు 15:27-28; లూకా 23:39-43.

III.  మూడవది, ఆయన అనేకుల పాపమును భరించెను, యెషయా 53:12సి; I పేతురు 2:24.

IV.    నాల్గవది, అతడు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను, యెషయా 53:12డి; లూకా 23:34; హెబ్రీయులకు 7:25; ఫిలిప్పీయులకు 2:8-11.