Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




రక్షకుని జయోత్సాహము!

(ప్రసంగము సంఖ్య 12 యెషయా 53)
THE SAVIOUR’S TRIUMPH!
(SERMON NUMBER 12 ON ISAIAH 53)
(Telugu)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువు దినము ఉదయము, ఏప్రిల్ 14, 2013
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 14, 2013

"ఆయన అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహొవా ఉద్దేశము అతని వలన సఫలమగును" (యెషయా 53:10).


యెషయా 53:10 మొదటి భాగము క్రీస్తు అనుగ్రహపు మరణమును గూర్చి తెలియజేస్తుంది. గత రాత్రి దానిని గూర్చి భోదించాను. ఈవచనములోని మొదటి భాగము చూపిస్తుంది తండ్రి దేవుడే ఆయన కూమరుని శ్రమలకు కారకుడు అని, ఆయనే అది కలుగజేస్తాడు. డాక్టర్ మెర్రిల్ అంగర్ అన్నారు, "ప్రభువు దుఃఖించే విధంగా ఆయనను చితుకగోట్టాడు" (Merrill F. Unger, Ph.D., Unger’s Commentary on the Old Testament, Moody Press, 1981, volume II, p. 1299). యెషయా 53:10 లోని మొదటి భాగం చెబుతుంది,

"అతని నలుగగోట్టుటకు యెహొవాకు ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను: అతడు తన్ను తానే అపరాధ పరిహారార్ధ బలిగా చేయబడెను…" (యెషయా 53:10ఎ).

ద కీల్ అండ్ డెలిప్ జెక్ కామెంటరి ఆన్ ద ఓర్డ్ టెస్టమెంట్ అంటుంది,

మనుష్యులు [క్రీస్తు] పై ఆ మెత్తే శ్రమను విధించారు, ఆ లోతైనా విపాదము; కానీ ప్రధాన [కారణము]దేవుడు, ఆయన మానవాళి పాపము ఆయన ఆనందాన్ని [సేవించింది] ఆయన చిత్తము, ఆయన చేయగలడు ముందుగా, నిర్ణయింపబడిన విచారణ (Eerdmans, 1973 reprint, vol. VII, part II, p. 330).

కాని ఇప్పుడు మనం చూస్తాం, యెషయా 53:10 రెండవ భాగములో, క్రీస్తు శ్రమల ద్వారా ఏమి వచ్చిందో, ఆయన శ్రమల ద్వారా ఏమి ఉద్భవించిందో. ఆయన తపన మరణము పునాది వేసింది, క్రీస్తు పునరుద్ధన విజయోత్సాహానికి, మరియు భూమి మీద ఆయన ప్రజల విజయానికి! దయచేసి లేచి నిలబడి వచనములోని రెండవ భాగాన్ని చదువుదాం, "ఆయన చూస్తాడు" అను మాటలతో ప్రారంబింపబడ్డాయి.

"…అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుశ్మంతుడగును, యోహావా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును" (యెషయా 53:10బి).

మీరు కూర్చోండి. గమనించండి పాథ్య భాగము నుండి క్రీస్తు శ్రమల నుండి వెలువడిన మూడు అద్భుత ఫలితాలు!

I. మొదటిది, అతని సంతానము చూచును!.

"అతని సంతానము చూచును" (యెషయా 53:10).

ఇది మొదటి ఫలితం యేసు మరణం కారణంగా. "అతని సంతానము చూచును." ఇది క్రీస్తు ఆత్మీయ విత్తనాన్ని ప్రస్తావిస్తుంది, అతని సంతానము. లక్షలాది మంది క్రీస్తు నోద్దకు వచ్చారు "ఆయన విత్తనం" అయ్యారు. యేసు ముందే ఊహించాడు ఆయన చెప్పేటప్పుడు,

"జనులు తూర్పు నుండియు, మరియు పడమటి నుండియు, మరియు ఉత్తరము నుండియు, మరియు దక్షిణము నుండియు వచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు" (లూకా 13:29).

పెంతెకోస్తు దినము నుండి, ప్రపంచ నలుమూలల నుండి లెక్కింప లేనంత మంది క్రీస్తు నోద్దకు వచ్చారు. చివరిలో, క్రీస్తు పరలోకము నుండి భువికి తిరిగి వస్తారు,

"అతని సంతానము భూమిని స్వతంత్రించు కొనెను" (కీర్తనలు 25:13).

కాని క్రీస్తు వేచి ఉండనవసరం లేదు ఆయన రెండవ సారి ఆయన విత్తనం దగ్గరకు తిరిగి రావడానికి. వెంటనే, మృతులలో నుండి పునరుత్థానుడైన తరువాత, ఆయన వారిని చూసాడు, వారు ఆయనను చూసారు! అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"ఆయన కేపాకును [పేతురు], తరువాత పన్నెండుగురికిని కనపడెను: అటు పిమ్మట, ఐదు వందలకు ఎక్కువైనా సహోదరులకు ఒక్క సమయముందే కనబడెను… ఆ తరువాత, అతను...అన్ని అపోస్టల్స్ కనిపించింది. మరియు అన్ని చివరికి అతను కూడా నాకు కనిపించింది" (I కోరెందీయులకు 15:5-8).

ఆయన సంతానము ఆయనను చూచెను. అపోస్తలుడైన యోహాను ఇలా అన్నాడు,

"జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో, అది తెలియ చేయుచున్నాము" (I యోహాను 1:1).

ఆయన ఆయన సంతానమును చూసేను, ఆయన మృతులలో నుండి లేచినప్పుడు,

"అప్పుడు…యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని, వారితో చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి అతను వారి వైపు చేతిని చూపుతూ వారిని చూడమని చెప్పెను. శిష్యులు ప్రభువును చూసినపుడు, సంతోషించిరి" (యోహాను 20:19-20).

"ఆయన ఆయన సంతానమును చూచును."

వారు ఆయనను చూసారు మరియు ఆయన వారిని చూసాడు – వారు ఆయన సంతానము, ఆయన ఆత్మీయ విత్తనాలు! ఆయన మృతులలో నుండి లేచినప్పుడు, ఆయన చూసాడు!

ఆయన పరలోకానికి ఆరోహణమైన తరువాత, పరిశుద్ధాత్మ శక్తి కదిలింది మూడు వేలమంది మార్చబడ్డారు. మళ్ళీ యెషయాలోని ఈ వాగ్ధానము నెరవేరింది. పరలోకము నుండి తొంగి చూచి, యేసు ఆయన సంతానాన్ని చూసాడు. కాబట్టి అపోస్తలుల కార్యములు అంతా అది కనిపిస్తుంది. పునరుత్థానుడైన క్రీస్తు మహిమాయుక్తమైన ఆయన సింహాసనము నుండి తొంగి చూచి ఆయన యుందు విశ్వాసముంచి ఆయన సంతానమైన బహూ సమూహాన్ని చూసాడు.

కనుక అది తరాలుగా వస్తూ ఉంది. యేసు పరలోకము నుండి తొంగి చూసాడు వృద్ధి చెందినా ఆయన సంతానాన్ని భూమండలమంతటిలో; తద్వారా యెషయా ప్రవచనము నెరవేరింది, వారు వస్తారు, "తూర్పు నుండియు, పడమటి నుండియు, ఉత్తరము నుండియు, మరియు దక్షిణము నుండియు, మరియు...దైవ సింహాసనములో ఆసీనుడై చూసాడు" (లూకా 13:29).

అవును, ఆ ప్రవచనము నెరవేరింది లక్షల సార్లు చరిత్ర అంతటిలో, మరియు ప్రపంచపు మారుమూలలలో.

"ఆయన ఆయన సంతానము చూచును."

నీవేప్పుడైతే విశ్వాసము ద్వారా యేసు నోద్దకు వస్తావో, ఆయన నిన్ను కూడా చూస్తాడు! మార్పు నొందిన ఆ క్షణములో నీవు ఆయన సంతానముగా ఉన్న అనేక మందిలో చేరుతావు – భూమి మీద పరలోకములో.

"ఆయన ఆయన సంతానము చూచును."

పునరుత్థానుడైన క్రీస్తు నందు మనం ఉత్సాహించడం ఆశీర్వాదకరమైన మహిమాయుక్తమైన దృశ్యం – పురుషులు స్త్రీలు అన్ని అన్ని జాతుల నుండి, దేశాల నుండి ఆయనను నమ్మిన వారితో, మనం కలిసి నిత్యమూ ఆయనతో ఉండడు! అవును,

"ఆయన ఆయన సంతానము చూచును."

నాభార్య నేను ఒక అద్భుతమైన డీవిడీని మొన్న రాత్రి చూసాం. అందులో చూసాం ఇరాన్ లో, ఒకరి తరువాత ఒకరు ముస్లీములు క్రీస్తు వైపు మరలి, క్రైస్తవులవడం. ఇరాన్ లో ఒక ముస్లీం స్త్రీ ఇలా అంది, "నేను నిరీక్షణ అంతా కోల్పోయాను." అప్పుడు ఆమె యేసుని విస్వసించింది. ఒక యవ్వనస్తుడు అన్నాడు, "నేను ముస్లీముగా ఉండడానికి ఇష్ట పడటం లేదు." అతడు, కూడా, యేసును నమ్మి క్రైస్తవుడయ్యాడు. ఇరాన్ లో చాల మంది యేసును విశ్వసిస్తున్నారు గత 1500 సంవత్సరాలలో లేనంతగా! ముస్లీం దేశాలలోని వేలకొలది యవ్వనస్తులు క్రైస్తవులవడానికి తెగిస్తున్నారు! యేసు చూస్తున్నాడు "ఆయన సంతానాన్ని" ముస్లీము ప్రపంచమంతటిలో విస్తరించడం! మన ప్రసంగాలు మన వెబ్ సైట్ లో అరబ్ లో వారికీ చేరుతున్నాయి!

ఆ అంతిమ విజయములో, మహిమలో క్రీస్తు వచ్చునప్పుడు భూమిపై ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకుప్రభువుగా వస్తాడు,

"అతని సంతానము భూమిని స్వతంత్రించు కొనును" (కీర్తనలు 25:13).

మరియు "ఆయన ఆయన సంతానమును చూచును," ప్రభువు నోటి ద్వారా పలుకబడింది! "యేసు ఏలును." పాడండి!

యేసు ఏలును ఎక్కడైతే సూర్యుడు
   తదుపరి ప్రయాణాలు కొనసాగిస్తాడో;
ఆయన రాజ్యము నలుమూలలా విస్తరించును,
   చంద్రులు అంతరించి ప్రకాశించేంత వరకు.
(“Jesus Shall Reign” by Isaac Watts, D.D., 1674-1748).

II. రెండవది, అతడు దీర్ఘాయుష్మంతుడగును!

యెషయా 53:10 లో పాఠ్యభాగాన్ని తిరిగి చూడండి, యేసు శ్రమల మరణాలను మరియొక గొప్ప ఫలితము.

"అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును..." (యెషయా 53:10).

క్రీస్తు మరణము కారణంగా రెండవ ఫలితము, "అతడు దీర్ఘాయుష్మంతుడగును," ఆయన సిలువపై మరణించినప్పుడు ఆయన జీవితం అంతమొందలేదు. ఆయన సమాధిలో ఎక్కువ కాలము ఉంచబడలేదు. మూడవ రోజు జయించిన, క్రీస్తు జీవించాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచి, సమాధి నుండి బయటికి వచ్చాడు, నిత్యం జీవించడానికి! “ఆయన పాపాలకు ఒకేసారి మరణించాడు, ఆయన దేవుని కొరకు జీవించాడు: దేవుని కొరకు జీవించాడు, నిత్యం మరణించకుండా ఉండడానికి! (రోమా 6:10).

"మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు; మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము చేయరనియు నమ్ము చున్నాము" (రోమా 6:9).

"మూడు విషాద దినాలు."పాడండి!

మూడు విషాద దినాలు త్వరగా ముగిసాయి;
ఆయన మృతులలో నుండి మహిమా యుక్తంగా లేచాడు:
మహిమంతా మన జీవించు తలకే! హల్లెలూయా!
హల్లెలూయా! హల్లెలూయా! హల్లెలూయా!
   (“The Strife is O’er,” translated by Francis Pott, 1832-1909).

"ఆయన దీర్ఘాయుష్మంతుడగును,"

"ఆయన నిరంతరము ఉన్నవాడు గనుక…విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు [మన కోసం]" (హెబ్రీయులకు 7:24,25).

స్పర్జన్ అన్నాడు, "ఆకాశపు అంచులలో నుండి ఆయన (క్రిందికి) చూస్తున్నాడు భూమిపై ఉన్న ఆయన విస్తార జనాంగాన్ని....ఆకాశములోని నక్షత్రముల వలే, లెక్కింప లేని ఇసుక రేణువుల వలే, వారు ప్రభువైన యేసు క్రీస్తు సంతానము" (C. H. Spurgeon, The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1978 reprint, volume 51, p. 565).

"అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును... " (యెషయా 53:10).

III. మూడవది, ఆయన పని వర్ధిల్లును!

లేచి నిలబడి పూర్తి పాఠ్యభాగాన్ని చదవండి, ఆఖరి భాగాన్ని ఆసక్తితో చూడండి, ప్రోరభాపు మాటలు, "భోగము."

"అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యొహొవా ఉద్దేశ్యము అతని వలన సపలమగును" (యెషయా 53:10).

ఇది మూడవ ఫలితము యేసు మరణము ద్వారా, "యోహావా ఉద్దేశము అతని వలన సఫలమగును." స్పర్జన్ అన్నాడు,

[పందొమ్మిది] వందల సంవత్సరాలకు పైగా గడిచాయి ఆయన మృతులలో నుండి సజీవుడై లేచి, కాని అయిన ఇంకా జీవిస్తూ ఉన్నాడు; ఆయన దినము, మనకు తెలుసు, భూదిగంతముల వరకు కొనసాగుతుంది, ఔను, చివరకు, ఆయన దేవుని రాజ్యములో, తండ్రీ కూడా, ఆయన దీర్ఘాయువును పోడిగించును. "మీ సింహాసనం, ఓ దేవా, నిరంతరము," మీరు సహిస్తారు, పర్వతము నశించినప్పటికి, ఆకాశములు వాడబారి చుట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు (స్పర్జన్, ఐబిఐడి.). (Spurgeon, ibid.).

"యోహావా ఉద్దేశము అతని వలన సపలమగును" (యెషయా 53:10).

మంచి అభుభూతులు, చిత్తము, దేవుని ఉద్దేశము, "ఆయన హస్తాలలో వర్ధిల్లుతాయి." తండ్రీ దేవుడు యేసుతో అన్నాడు,

"భూమి గతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్య జనులకు వెలుగై ఉండునట్లు, నిన్ను నియమించి యున్నను" (యెషయా 49:6).

"జనములు నీ వెలుగునకు వచ్చెదరు...జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును" (యెషయా 60:3,5).

"చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు: మరియు, తక్కువ, వీరు ఉత్తర దిక్కు నుండియు పడమటి దిక్కు నుండియు వచ్చుచున్నారు; వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు [చైనా]" (యెషయా 49:12).

"యెహావా ఉద్దేశము అతని మీద సఫలమగును" (యెషయా 53:10).

కొన్ని నెలల క్రితం హత సాక్షుల స్వరముచే చైనా విభజింపబడు వీడియో ప్రదర్శన చూసాం. అందులో వృద్ధ చైనా మనుష్యుడు మోసన్ జై (షే) సాక్షము చూపబడింది. "సంస్కృతిక విప్లవములో," ఇరవై సంవత్సరాలకు పైగా బంధింపబడి చెరసాలలో మూయబడ్డాడు కమ్యూనిష్టులచే ఎందుకంటే క్రీస్తు సువార్తను ప్రకటించాడు కాబట్టి. నిష్ప్రుహలో, నిరాశకు లోనయ్యాడు. అప్పుడు, అతడు అన్నాడు, యేసు సర్వము అతని హృదయముతో మాట్టాడింది, "నా బిడ్డా, నా కృప నీకు చాలు." సహోదరుడు జై అన్నడు అది తన హృదయములో విన్నాడని, ఉద్వెదములొ కంటతడి పెట్టాడు, మూడవ సారి విన్నప్పుడు. కృతజ్ఞతా భాష్పాలు అతని కళ్ళల్లో నిండాయి. "నా బిడ్డా, నా కృప నీకు చాలును." అతడు క్రీస్తు శక్తి ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఆ జైలులో అతని రక్షించడానికి.

తరువాత ఆ వీడియోలో వేరే చిత్రము చూపబడింది వేలకొలది చైనా కమ్యూనిష్టులు మాయోట్సేటంగ్, అనే క్రూర నియంతను ఆరాధించాడు, అతడు హిట్లర్ కంటే ఎక్కువమందిని చంపాడు. వారు మాయోట్సేటంగ్ ను పొగుడుతున్నప్పుడు, నేననుకుంటాను, "మనము క్రైస్తవులం అక్కడ ఉంటాం ఎప్పుడైతే నీవు కమ్యూనిష్టులు వెళ్లి పోతారో." ఎప్పుడైతే చైనా కమ్యూనిష్టు పార్టీ చైనా చరిత్రలో ఉంటే, క్రైస్తావ్యము తప్పకుండా ఉండాలి, ఇంకా బలంగా, ఎందుకంటే ఈ రోజుల్లో అద్భుతంగా పెరుగుతుంది. "మనము ఉంటాం ఎప్పుడైతే నీవు వెళ్లి పోతావో." అది అంటే భూగోళమంతా. క్రీస్తు శత్రువులకు, వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ, మనం పూర్తిగా నమ్మడంతో చెప్పొచ్చు, "మనం క్రైస్తవులం ఉంటాం మీరు కమ్యూనిష్టులు వెళ్లి పోయినప్పుడు!" "యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును"!

క్రైస్తవులు తక్కువగా ఉండొచ్చు మనస్యుల దృష్టిలో తృణీకరింపబడినవారుగా ఉండొచ్చు. మనం హేళన చేయబడి, తృణీకరింపబడవచ్చు, భూమి మీద ఉన్నప్పుడు మన రక్షకునిలాగానే. కాని క్రీస్తు మృతులలో నుండి లేచాడు, "యోహావా ఉద్దేశము అతని వలన సఫలమగును." కాబట్టి, నిజ క్రైస్తవత్వము ఎంత తృణీకరింపబడినప్పటికీ, తిరస్కరింపబడినప్పటికి, "ఆయన చేతిలో వృద్ధి చెందును.". ఆఖరిలో,

"ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము [తప్పక] ఏలును; ఆయన యుగ యుగముల వరకు ఏలును" (ప్రకటన 11:15).

ఇప్పుడు, నా సహోదరులారా, మనం చూస్తాం యేసు’ మరణం ఏమి సాధించిందో, "యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును." యేసు తిరిగి వస్తాడు భూ రాజ్యాన్ని ఏలడానికి!

యేసు ఏలును ఎక్కడైతే సూర్యుడు
   తదుపరి ప్రయాణాలు కొనసాగిస్తాడో;
ఆయన రాజ్యము నలుమూలలా విస్తరించును
   చంద్రులు అంతరించి ప్రకాశించేంత వరకు.
(“Jesus Shall Reign” by Isaac Watts, D.D., 1674-1748).

ఆయన తిరిగి వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు,
   ఆయేసే, మనస్యులచే తిరస్కరించబడినవాడు;
ఆయన తిరిగి వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు,
   గొప్ప మహిమా శక్తితో, ఆయన తిరిగి వస్తాడు!
(“He Is Coming Again” by Mabel Johnston Camp, 1871-1937).

ఇప్పుడు, మీలో కొంత మంది ఉన్నారు ఈ ఉదయం ఆశ్చర్య పోతున్నారు మనం ఎందుకు ఉత్సాహంగా ఉన్నామని. మీరు అనుకుంటున్నారు, "ఎందుకు వీళ్ళు ఇంత భారము కలిగి యున్నారు? ఎందుకు ఈ విషయాలు ఎత్తి చూపుతున్నారు?" నేను నమ్ముతాను ఏంతో కాలంగా ఈ సంఘములో ఉంటున్న మీరు కూడా ఇలాగే భావిస్తూ ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు, "దీని అంతటి ద్వారా తిరిగి మనం వెళ్ళాలా? మేము మునుపు విన్నాం. ఎందుకింత ఉత్సాహం? ఎందుకింత ఉత్తేజం? ఆహ్వానాన్నిచ్చి ముగించవచ్చు గదా?" నాకు తెలుసు కొంతమంది మీలో ఇలా అనుకుంటున్నారు. "ఎందుకింత ఉత్తేజం?" ఇది ఒక మర్మం మీకు. మీరు ఈ ఉత్సాహంతో ప్రవేశింపలేరు!

నాకు భాగా తెలుసు, చూడండి, నేను బాస్కెట్ బాల్ అభిమానిని కాదు. నాకు బాస్కెట్ బాల్ ఆటలో ఉత్సాహమిచ్చేది ఏమీ లేదు! నా మట్టుకైతే అది ప్రపంచంలో కెల్లా చాలా విసుగు కలిగించేది. కాని మీలో కొందరికి అది ఆసక్తికరం. ఎందుకు ఈ తేడా? తేడా ఏమిటంటే చాలా సులభం. మీరు భాస్కేట్ బాల్ అభిమాని, నేను కాదు! అది అంత తేలిక. మీరు ఆ ఉత్సాహం పొందొచ్చు కాని నాకు కాదు. మనం ఎందుకు తేడాగా అనుకుంటామో ఆ కారణాలు లోనికి వెళ్ళడం లేదు. ఒకటి మిమ్ములను ఉత్తేజపరుస్తుంది లేకర్స్ ఆట చూస్తున్నప్పుడు. నేను మీతో దానిలో ప్రవేశించలేను. నా స్వభావములో మార్పు ఉండాలి లేకపోతె మీరు భావిస్తున్నట్టు నేను భావించలేను.

అదే విధంగా క్రీస్తు విజయాన్ని గూర్చి కూడా. మీరు ఉద్రేక పడవచ్చు క్రీస్తు పునరుత్థానము రెండవ రాకడను గూర్చి. మీరు ఉద్రేకింపబడలేరు. మనం క్రీస్తు అభిమానులం, కాని నీవు క్రీస్తు అభిమానివి కాదు! నీ స్వభావము మార్చబడాలి మాలాగే నీవు కూడా అనుభూతి చేడడానికి క్రీస్తు విజయం విషయంలో. బైబిలు దాని గురించి ఇలా చెబుతుంది, "ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపదు: అతనికి అవివేకము ఉంటాయి" (1 కోరిందీయులకు 2:14). నీవు "ప్రకృతి సంభండివి" కాబట్టి క్రీస్తు విజయం నీకు అంత ప్రాముఖ్య మైనది కాదు. మీరు దానికి ఉత్తేజితులవరు. మీ స్వభావము మారాలి మీరు క్రీస్తు విజయం విషయంలో ఉద్రేకులవడానికి! నీవు మార్చబడాలి మాలాంటి అనుభూతి పొందడానికి!

నీకు తెలుసు నీవు తప్పక మాలో భావించాలి, నీవు భావిస్తున్నట్టుగా నిన్ను నీవు చేసుకోలేవు! నీవు ఎంత కష్టపడినా, నీవు భావించాలేవు క్రీస్తు విజయాన్ని గూర్చి మేము చేస్తున్న పనుల విషయంలో! మీరు అలా అనుకోవాలి, కాని మీరు అలా అనుకోలేరు ఎంత గట్టిగా ప్రయత్నించినా. నీవు భావిస్తున్న వర్తిగా నీవుందలేవు. దాని అర్ధమే పాప పశ్చాత్తాపము అవసమని!

మీరు యేసు నోద్దకు వచ్చి చెప్పాలి, "ప్రభువా, నీవు ఎలా ఉండాలని ఆశిస్తున్నారో అలా ఉండ లేకపోతున్నాను! నేను తప్పిపోయాను! నేను నిర్వీర్యున్ని, నన్ను నేను మార్చుకోలేను! యేసూ, నన్ను రక్షించు!" ఎప్పుడైతే నీవు అలా భావిస్తావో, నీవు రక్షింపబడడానికి దగ్గరగా ఉన్నారు. పాపపు ఒప్పుకోలు ముందు వస్తుంది క్రీస్తులో మారే ముందు! para_indent

మీలో ఇంకా మారని వారికీ, మేము బ్రతిమాలుచున్నాము తిరిగి లేచిన క్రీస్తును నమ్మాలని. మేము ప్రోత్సహిస్తున్నాము ఆయన ప్రశస్త రక్తములొ మీ పాపాలు కడుగుకోవాలని. మేము వేడుచున్నాము మాతో వచ్చి రక్షకుని వెంబడించాలని వెల ఎంతైనా! మనము గెలిచే వైపు ఉన్నాం, "యోహావా ఉద్దేషములు అతని వలన సఫలమగును." కాబట్టి యేసు విశ్వసించాలని, నేను వేడుచున్నాను మార్చబడండి, గెలిచే వైపు ఉండండి!

రండి, తరువాత, ఈ పవిత్ర కచేరి బృందంలో కలవండి,
   మహిమలో వెళ్ళడానికి,
ఆ శ్రేష్ట భూమిపై నివసింపడానికి,
   అక్కడ నిత్యానందం ప్రవహిస్తుంది.
కేవలం ఆయనను నమ్ము, కేవలం ఆయనను నమ్ము,
   కేవలం ఆయనను నమ్ము, ఇప్పుడే.
ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు,
   [క్రీస్తు] నిన్ను రక్షిస్తాడు ఇప్పుడే.
(“Only Trust Him” by John H. Stockton, 1813-1877).

ఆ పాత మళ్ళీ పాడండి. పాడుచుండగా "ఆయననే నమ్ము," నీవు ఇంకా రక్షింపబడకపోతే, నీవు సీటులోనుండి లేచి ఆవరణ వెనుక భాగానికి వెళ్ళు. డాక్టర్ కాగన్ నిన్ను వేరే గదిలోనికి తీసుకొని వెళ్లి, మీతో మాట్లాడి ప్రార్ధిస్తారు. మేము పాడుచుండగా వెళ్ళండి.

కేవలం ఆయనను నమ్ము, కేవలం ఆయనను నమ్ము,
   కేవలం ఆయనను నమ్ము, ఇప్పుడే.
ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు,
   [క్రీస్తు] నిన్ను రక్షిస్తాడు ఇప్పుడే.

లీగారు, మమ్ములను ప్రార్ధనలో నడిపించండి స్పందించిన వారి నిమిత్తము.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసగాలు ప్రతీవారము”
అంతర్జాలములో www.realconversion.com ద్వారా చదువవచ్చు.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రీగ్ టాన్ ఎల్.చాన్:
యెషయా 53:1-10.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ద స్త్రైఫ్ ఈజ్ ఓ’వర్” (ఫ్రాన్సిస్ పోట్ గారిచే
అనువదింపబడినది, 1832-1909).
“The Strife is O’er” (translated by Francis Pott, 1832-1909).


సంక్షిప్తంగా

రక్షకుని జయోత్సాహము!

(ప్రసంగము సంఖ్య 12 యెషయా 53)

డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే.

"ఆయన అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహొవా ఉద్దేశము అతని వలన సఫలమగును" (యెషయా 53;10).

I.   మొదటిది, అతని సంతానము చూచును! యెషయా 53:10ఎ; లూకా 13:29; కీర్తనలు 25:13; I కోరిందీయులకు 15:5-8;
 I యోహాను 1:1; యోహాను 20:19-20.

II.  రెండవది, అతడు దీర్ఘాయుష్మంతుడగును! యెషయా 53:10బి; రోమా 6:10, 9; హెబ్రీయులకు 7:24, 25.

III. మూడవది, ఆయన పని వర్ధిల్లును! యెషయా 53:10సి; 49:6; 60:3, 5; 49:12; ప్రకటన 11:15; I కోరిందీయులకు 2:14.