ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రీస్తు సమాధిని గూర్చిన వైరుధ్యము (ప్రసంగము సంఖ్య 10 యెషయా 53) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము "అతడు మరణమైనప్పుడు భక్తి హీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను; నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు" (యెషయా53:9). |
క్రీస్తు సమాధిని గూర్చి మీరీ ఎన్ని ప్రసంగాలు విన్నారు? నేను ఒక్కటీ వినలేదు, 55 సంవత్సరాల నుండి భోధిస్తున్నప్పటికినీ గుడిలో 59 సంవత్సరాల నుండి ఉంటున్నప్పటికినీ. క్రీస్తు సమాధిని గూర్చి ఒక్క ప్రసంగము కూడా చదివినట్టు నాకు గుర్తుకు లేదు! ఇంకా ఎక్కువగా మనం విని వుండవచ్చు. మెట్టుకు, ఆయన సమాధి అప్రాముఖ్యమైనది కాదు. నిజానికి సువార్తలో అది రెండవ విషయము! "లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి చెందెను" (I కోరిందీయులకు 15:3). అది సువార్త లో మొదటి విషయము. "అతడు సమాధి చేయబడెను" (I కోరిందీయులకు 15:4). అది సువార్తలో రెండవ విషయము. మనం సువార్త బోధిస్తున్నామని ఎలా చెప్పగలం అందులోని రెండవ విషయము ప్రస్తావించకుండా? కానీ, తరువాత, ఈ రోజుల్లో కొన్ని ప్రసంగాలు మొదటి లేక మూడవ విషయాలపై దృష్టి పెట్టడం లేదు! అది ఆధునిక భోధలలోని గొప్ప బలహీనత. మనం సువార్తను విశిష్టమైనదిగా చెయ్యాలి. మనము క్రీస్తును ఎక్కువ గౌరవముతో చూడాలి, మన భోధలలో ఆయనకు ఆయన ప్రాయశ్చిత్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మంది విలపిస్తున్నారు ఈ రోజులలో గొప్ప భోధ అరుదుగా కనిపిస్తుందని. నేను పూర్తిగా అంగీకరిస్తాను. ఈ రోజుల్లో మంచి బోధ చాలా తక్కువ, నిజంగా చాలా తక్కువ! కానీ ఎందుకిది నిజం? ఎందుకంటే చాలా తక్కువ భోధింపబడుతుంది. కాపరులు "క్రైస్తవులకే భోధిస్తారు" నశించు వారికి సువార్త ప్రకటించే బదులు, వాళ్ళ సంఘాలు నశించుచున్న వారితో ఉంటున్నప్పటికినీ! "నైతిక బోధలు" "క్రైస్తవులని" సిలువ పడే వారికీ-వాటిని గొప్ప బోధగా పరిగనించలేము! ఎప్పుడైతే క్రీస్తు కేంద్ర బిందువు కాదో, బోధ గొప్పదిగా అవనేరదు! సువార్తను గూర్చిన జ్ఞానము కంటే క్రీస్తును గూర్చిన సత్యాలు తెలుసుకోవడం చాలా ఎక్కువ. నిజమైన సువార్తను గూర్చిన జ్ఞానము క్రీస్తును గూర్చిన జ్ఞానమే. యేసు అన్నారు, "అద్వితీయ సత్య దేవుడైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును, ఎరుగుటయే నిత్య జీవము" (యోహాను 17:3). జార్జీ రికర్ బెర్రీ అన్నాడు పదము "ఎరుగుట" అర్ధము "అనుభవ పూర్వకముగా…ఎరుగుట" (Greek-English New Testament Lexicon). నిజ క్రైస్తవుడిగా ఉండడానికి అనుభవము ద్వారా నీవు క్రీస్తును ఎరుగాలి. సత్యాలను గూర్చిన జ్ఞానము నిన్ను రక్షింపనేరవు. మన పాపాల కొరకు ఆయన మరణించాడు అని అనుభవము ద్వారా ఎరుగాలి. ఆయన సమాధి అనుభవము ద్వారా తెలుసుకోవాలి. ఆయన పునరుత్తానము అనుభవము ద్వారా తెలుసుకోవాలి. అది రక్షణకు మార్గము. అది నిత్యజీవానికి దారి. "అద్వితీయ సత్య దేవుడైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును, ఎరుగుటయే నిత్య జీవము" (యోహాను 17:3). ఈ అనుభవాలు నీకు లేకపోతే, నేననుకుంటాను మీకు అసౌకర్యము కలిగించానని. నీవు నిజ క్రైస్తవుడవు కావు అనడంలో ప్రశ్నే లేదు, ఎందుకంటే నీవు నిజ మార్పును అనుభవించలేదు. నీవు తొందర పడతావు మనస్తాపం నొందుతావు, నీవు మనసు మార్చుకునే వరకు, యేసు పాదాల మీదపడి నిజ రక్షణను ఆయనలో కనుగో. క్రీస్తును ఎరుగడానికి, నీవు సిలువ దగ్గరకు వెళ్ళాలి, విశ్వాసంతో ఆయనను చూడాలి ఆయన నీ పాప ప్రాయశ్చిత్తము కోసం సిలువ వేయబడ్డాడు. క్రీస్తు సమాధిలోనికి కూడా వెళ్ళాలి విశ్వాసం ద్వారా "మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి" (రోమా 6:4ఎ), ఆయనతో మరణించుట ద్వారా మనము లేచి "నూతన జీవముతో నడుచుచున్నాము" (రోమా 6:4బి). కాబట్టి మనం పాఠ్య భాగానికి వద్దాం ఆయన సమాధిని గూర్చి నేర్చుకోవాలి, తద్వారా ఆయనతో అది అనుభవించవచ్చు. "అతడు మరణమైనప్పుడు భక్తి హీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను; నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు" (యెషయా53:9). ఈ వచనములో మనము క్రీస్తు సమాధి వైరుధ్యాన్ని చూస్తున్నాం, కొట్టిచ్చే విరుద్ధత, అందులోని సారంశము. అప్పుడు విచ్చుటకు జవాబు కనుక్కొంటాం. I. మొదటిది, ఆయన సమాధిని గూర్చిన వైరుధ్యము. "అతడు మరణమైనప్పుడు భక్తి హీనులతో అతనికి సమాధి వేయబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను…” (యెషయా53:9). క్రీస్తు దినాలలో, "దుష్టులు" నేరస్తులు. "గొప్పవారు" గౌరవముగా పరిగణింపబడేవారు. అలాంటప్పుడు ఆయన సమాధి దుష్టులతోను "ధనికులతోను ఎలా ఉండగలరు"? ఇది ఆదిమ యూదా వ్యాఖ్యానికులను తికమక పరిచింది. ఇది ఒక వైరుధ్యము, కొట్టిచ్చే విరుద్ధత, వారి మనసులలో. కాని ఈ గజిబిజి యోహాను సువార్తలో పరిష్కరింపబడింది. యేసు ఇద్దరు దొంగల మధ్య చనిపోయాడు, ఒకడు ఎడమ వైపు, మరియొకడు కుడి వైపు. వారు మన పాఠములో "దుష్టులుగా" చూపించబడ్డారు. యేసు మొదట చనిపోయాడు, తరువాత ఆ దొంగలు కొంతసేపు బ్రతికే ఉన్నారు. "ఆ దినము, సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహా దినము [మహా దినము], కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉంచకుండునట్లు…వారి కాళ్ళు విరుగ కొట్టించి, వారిని తీసివేయించుమని యూదులు పిలాతుని అడిగిరి" (యోహాను 19:31). సైనికులు దొంగల కాళ్ళు విరుగగొట్టారు. ఇది ఎందుకు అయిందంటే, ఊపిరి పీల్చకుండా ఉండడానికి, త్వరగా చనిపోవడానికి. కాని యేసు నోద్దకు వచ్చినప్పుడు, మధ్య సిలువ మీద ఉన్న ఆయన, అప్పటికే చనిపోయాడు. వారిలో ఒకడు ఆయన ప్రక్కలో ఈటెతో పొడిచాడు ఆయన మరణాన్ని నిర్ధారించుకోడానికి. వెంటనే రక్తము నీళ్ళు కారాయి, గుండె ఆగి చనిపోయాడు అని తెలుస్తుంది. ఆయన రాజ సింహాసనం పై ఏలలేదు, అప్పుడు ఊహించనిది జరిగింది. ఇద్దరు ప్రముఖులు యేసు దేహము కొరకు ముందుకు వచ్చారు. వారు ధనవంతుడైన అరిమతాయి జోసెప్, ఇంకొకడు యూదుల పరిపాలకుడైన నికోదేము, యూదా సన్ హెడ్రిన్ సభ్యుడు, రాత్రిలో వచ్చి యేసును కలిసిన వాడు (సిఎఫ్. యోహాను 3:1-2). వారిద్దరూ రహస్య శిష్యులు, ఇప్పుడైతే వారు మొదటిసారి బాహాటముగా ముందుకు వచ్చారు. వారు నిజానికి వారి ప్రాణహానికి తావిచ్చారు. డాక్టర్ మెక్ గీ అన్నాడు, వీరిని గూర్చి మరీ విమర్శినాత్మకంగా మనం ఉండొద్దు. వారు తెర వెనుకనే ఉన్నారు కాని, యేసు శిష్యులైతే గొర్రెల వలె చెదిరిపోయి దాగుకొన్నారు, వీరిద్దరైతే భాహాటంగా ముందు కొచ్చారు (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson, 1983, volume IV, p. 494). అరిమతయి జోసెఫ్, నికోదేము యేసు దేహాన్ని తీసుకున్నాడు. జోసెఫ్ ధనవంతుడు తానూ తన కొత్త సమాధిలో యేసు శరీరాన్ని ఉంచాడు, "తానూ రాతిలో లోలిపించుకోనిన క్రొత్త సమాధిలో వానిని ఉంచి: సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి, వెళ్లిపోయెను" (మత్తయి 27:60). ఇలా క్రీస్తు సమాధి వైరుధ్యత వివరించబడింది. అవును, ఆయన దుష్టులతో సమాధి చేయబడ్డాడు, ఇద్దరు దొంగల మధ్య సిలువపై మరణించాడు. కాని ఆయన "ధనవతుని యొద్ద అతడు ఉంచబడెను" (యెషయా 53:9), ధనవంతుని సమాధిలో. క్రీస్తు ప్రతి నాయనికి చావును ఎదుర్కొన్నాడు, కాని ధనవంతుని గౌరవప్రద సమాధి చేయబడ్డాడు. మన ప్రభువు విచారానికి స్థితి అనంతమని తెలుస్తుంది. ఆ దొంగలతో పాటు ఆయన దేహము తీసుకొనిపోబడలేదు. ఆ దేహము తగిన గౌరవ మర్యాదలతో విశ్రాంతిలో ఉంచబడింది, ధనికుడైన గౌరవప్రద వ్యక్తీ సమాధిలో ఉంచబడింది. దీనిని బట్టి ఈ వైరుధ్యత, పాత భోధకులను గజిబిజి చేసింది, మన పాఠ్య భాగము విశదీకరించింది. "అతడు మరణమైనప్పుడు భక్తి హీనులతో అతనికి సమాధి వేయబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను ” (యెషయా53:9). కాని ఇంకొక కారణముంది క్రీస్తు తన సమాధిని దుష్టులతోను ధనికులతోను ఉండడానికి. నేనన్నట్టు, యూదా ప్రజలు నేరస్తులను చట్ట విరుద్ధులను "దుష్టులుగాను," మరియు "ధనికులను" గౌరవనీయులు గాను పరిగణించారు. యేసు చూపిన సత్యము "ఆయన సమాధిని" ఈ రెండు గుంపులతో కలుపుట ఏమి చూపిస్తుందంటే పురాతన బోధకులు తప్పు చేసారు "దుష్టులను" మరియు "ధనికులను" విడదీయుట ద్వారా. వారు రెండు గుంపులు కానే కాదు. ఇరువురు పాపులే. అది ఈ రోజుల్లో కూడా వాస్తవమే. గౌరవనీయులు పాపులే "దుష్టులు" పాపులే. నేను కూర్చొని ఈ ప్రసంగ భాగము రాస్తున్నప్పుడు ఒక వ్యాపారి ఫోను చేసి, "నిర్మాణాత్మక" పరిచర్యకు విరాళం అడిగాడు. అతను అడిగాడు, "ఈ క్రింది వాటిలో ఏది అతి ప్రాముఖ్య సమస్య అమెరికా ఎదుర్కొంటుంది-గర్భ స్రావము, ఇజ్రాయేలును సమర్ధించడంలో విఫలమవడం, లేక ఏక లైంగిక వివాహాలు?" నేనన్నాను, "అవేమీకాదు. అమెరికా ఎదుర్కొంటున్న ప్రాముఖ్య సమస్య ఏమిటంటే మన సంఘ కాపరులు వారి సంఘసభ్యుల పాపాలను గూర్చి బొధించరు." నా అర్ధం ఏంటి? నా ఉద్దేశము గర్భస్రావము, ఏక లైంగిక వివాహములు మరియు ఇజ్రాయేలును సమర్ధించడంలో విఫలం, అది వాస్తవ రోగము కాదు, రోగానికి సూచనలు మాత్రమే, సూచనలు బాగు చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు. కాని అది నిలిచిపోయే మంచి చేయదు కాని అస్సలు జబ్బును గూర్చి ద్రుష్టి సారించాలి. ఆ జబ్బే పాపము - ఆ పాపము స్వతంత్రులను సమగ్రులను చంపుతుంది; ఆ పాపమే డెమొక్రేటిక్ వారిని రిపబ్లికన్ వారిని నశింపచేస్తుంది; ఆ పాపమే "దుష్టులను" మరియు "ధనికులను" సంహరిస్తుంది. పాపము హృదయములో ఉంది. మానవుని హృదయము చెడ్డది, అతని భాహ్య క్రియలు కాదు. పాపము లోలోపలి తలంపులను, కోరికలను క్రమపరుస్తుంది. నీ పాప హృదయము నీకు చెబుతుంది తప్పుడు పనులను గూర్చి ఆలోచించమని. అప్పుడు నీ పాపపు స్వభావము దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయించి, నీవు ఆలోచిన్స్తున్న పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. పాపము నీ అంతరంగిక జీవితాన్ని లోపర్చుకుంటుంది, అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయిస్తుంది, దేవునికి వ్యతిరేకిని చేస్తుంది. దేవుని వ్యతిరేకముగా నీ హృదయము తిరుగుబాటు బలంగా ఉంది మారదు, నీపై ఆధిపత్యం వహిస్తుంది. నీవు ఒక స్థలానికి తీసుకొని రాబడాలి అపోస్తలునితో చెప్పడానికి, "అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?" (రోమా 7:24), అప్పుడే నీవు యేసు "అతని మరణము"-"దుష్టులతోను" మరియు "ధనికులతోను" ఏర్పరచుకోవడంలో ప్రాముఖ్యత అర్ధం చేసుకుంటావు. నీ గతం ఎలాంటిదైనా, క్రీస్తు చనిపోయి పాతిపెట్టబడెను, నీ పాపము క్షమించబడడానికి, తొలగింపబడడానికి. డాక్టర్ జె. విల్బర్ చాప్మన్ ఆయన కీర్తనలో వ్రాసాడు, "పాతిపెట్టబడి, ఆయన నా పాపాన్ని కొనిపోయాడు" ("ఒక రోజు" డాక్టర్ జె. విల్బర్ చాప్మన్, 1859-1918). కేవలం క్రీస్తు నీ పాపాన్ని క్షమిస్తాడు! కేవలం క్రీస్తు మాత్రమే పాపపు తిరుగుబాటు హృదయాన్ని మార్చగలడు! "అతడు మరణమైనప్పుడు భక్తి హీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను” (యెషయా53:9). II. రెండవది, వైరుధ్యత వివరించబడింది. మన పాఠములోని రెండవ భాగం చూపిస్తుంది, ఎందుకు క్రీస్తు నీచంగా దొంగలతో చనిపోయినప్పటికినీ, గౌరవ మర్యాదలతో పాతి పెట్టబడ్డాడు. దయచేసి లేచి, రెండవ భాగము చదవండి, ఆరంభ పదాలు, "నిశ్చయముగా అతడు ఏ అన్యాయం చేయలేదు..." (యెషయా 53:9). "అతడు మరణమైనప్పుడు భక్తి హీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను; నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు" (యెషయా53:9). కూర్చోండి. ఇది క్రీస్తు గౌరవప్రద సమాధికి కారణం ఇస్తుంది. గౌరవం ఇవ్వబడింది ఎందుకంటే అతడు అన్యాయమేమియు చేయలేదు; ఎవరినీ గాయ పరచలేదు. దొంగతనము, హత్య, క్రూరత్వం లాంటివి ఆయనలో కానరావు. ఆయన గుంపును రెచ్చగొట్టలేదు, లేక యూదా, రోమా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కల్లోలాలు సృష్టించలేదు. అతని నోట ఏ కపటమును లేదు. ఆయన ఎన్నడు తప్పుడు సిద్దంతము నేర్పించలేదు. ప్రజలను మోసగించలేదు, నేరము మోపబడినట్టుగా, అతి బట్ట-తల అబద్దము. దేవునికి నిజ ఆరాధన నుండి ఎవరినీ దారి తప్పించలేదు. ఆయన, ప్రవక్తల నిత్యమూ మోసే న్యాయ శాస్త్రాన్ని గౌరవించారు. వారి మతానికి రాష్ట్రానికి శత్రువు కాదు. నిజంగా, ఎలాంటి పాపారోపణ లేదు. అపోస్తలుడైన పేతురు అన్నాడు క్రీస్తు, "అతడు ఏ పాపము చేయలేదు, అతని నోట ఏ [కపటమును] లేదు" (1 పేతురు 2:22). డాక్టర్ యాంగ్ అన్నాడు, "[క్రీస్తు] కు గౌరవప్రద సమాధి ఇవ్వబడింది, భయంకర మరణము కలిగింది ఎందుకంటే అతని పరిపూర్ణ అమాయకత్వము. [కాబట్టి] నేర శత్రువుల్లా చెయ్యలేదు, ఆయన పొందుకోడు [ఒక] హీన సమాధి కాని, గౌరవప్రద సమాధి ధనికులతో. " అది నాకు గుర్తు చేస్తుంది సర్ విన్ స్టన్ చర్చిల్, ఎన్నుకున్నాడు గౌరవ సమాధి అతని తండ్రీ ప్రక్క గుడి ఆవరణలో, ఆయన తలంచాడు తండ్రీ శత్రువుల సమాధి, అతని శత్రువుల సమాధి, ఎవరైతే ఇంగ్లాండ్ ను అప్పగించారో, అగౌరవ ప్రదంగా భావించాడు, అవి ఘనంగా వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరిగినప్పటికినీ, ప్రతికూలంగా వారి హీనాతిహీన వైఖరి హిట్లర్ మరియు నాజి పరిపాలన పట్ల. చర్చిల్ తిరిగి జన్మించిన క్రైస్తవుడు కానప్పటికినీ, అతడు గౌరవనీయుడు. యేసు, బహుశా, జీవించిన వారందరిలో అతి శ్రేష్టుడు. అవును, ఆయన అప్పుడు ఇప్పుడు మానవుడే, "ఆయన క్రీస్తు యేసును నరుడు" (I తిమోతీ 2:5). ఆయన గొప్పతనము ఏ సత్యములో దారి ఉంది అంటే ఆయన ఇష్ట పూర్వకంగా తన ప్రాణాన్ని మన పాపముల నిమిత్తము ఇచ్చాడు తండ్రీ దేవుని దృష్టిలో. ఆయన సిలువ వేయబడక మునుపు, యేసు ఇలా అన్నాడు, "తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వానికంటే, ఎక్కువైనా ప్రేమ గలవాడు ఎవడును లేడు" (యెషయా 15:13). ఘోర సిలువ ఆయనకు సింహాసనమైంది, ఇప్పుడు, స్నేహితుడా, క్రీస్తు అనబడు యేసుతో ఏమి చేస్తావు? సి.ఎస్. లెవిన్ అన్నాడు, రెండు స్పందనలు ఉన్నాయి - "నీవు ఆయనపై ఉమ్మివేసి, దయ్యం వలే చంపొచ్చు; లేక ఆయన పాదాల పై పడి ఆయనను ప్రభువా దేవా అనవచ్చు." అందులో ఏది నీకు? మూడవ ఎన్నిక ఆయనను పూర్తిగా నిర్లక్షము చేసి, వెళ్లి పోవచ్చు ఆయన బాధ శ్రమ నీకు కాదన్నట్టు. నేను చాలా విచారిస్తాను ఎవరైతే రక్షకుని అలా అగౌరవంగా చూస్తారో నా ప్రార్ధన నీవు వారిలో ఒకరివి కాకూడదు. టి.ఎస్. ఎలైట్ వారిని "భూటకం మనుష్యులు" - అని పిలిచాడు మీరు క్షణిక ఆనందం కోసం మాత్రమే జీవిస్తుంటారు. అవును, నా ప్రార్ధన వారిలో నీవు ఒకడవు కాకూడదు, ఎందుకంటే నరకపు అగాదాలలో వారి స్థానము ఉంటుంది. గెత్సమనేను మరువరాదు; నీవు యేసు వద్దకు రావాలని నా ప్రార్ధన, ఆయన నీ హృదయమంతటితో నమ్ము, మరణములో నుండి జీవములొనికి దాటు క్రైస్తవుని మార్పు ద్వారా. మనం కలిసి నిలబడుదాం. నీవు మాతో మాట్లాడాలనుకుంటే యేసు రక్తం ద్వారా నీ పాపాలు కడగబడాలనుకుంటే, ఇప్పుడే ఆవరణ వెనుక భాగానికి రండి. డాక్టర్ కాగన్ ప్రశాంత స్థలానికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడుతారు. లీ గారు, దయచేసి వచ్చి స్పందించిన వారి కొరకు ప్రార్ధించండి. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ |
ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రీగ్ టాన్ ఎల్.చాన్: యెషయా 53:1-9.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఎ క్రౌన్ అఫ్ తోర్న్స్” (ఇరా ఎఫ్. స్టాన్ ఫిల్ గారిచే, 1914-1993)/
“లీడ్ మీ టు కల్వరి” (జెన్నీ ఇ. హుస్సీ, 1874-1958).
ద అవుట్ లైన్ ఆఫ్ ప్రాయశ్చిత్తం విషదీకరణ (ప్రసంగము సంఖ్య 10 యెషయా 53) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. "అతడు మరణమైనప్పుడు భక్తి హీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను; నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు" (యెషయా53:9). (I కోరిందీయులకు 15:3-4; యోహాను 17:3; రోమా 6:4) I. మొదటిది, ఆయన సమాధిని గూర్చిన వైరుధ్యము, యెషయా 53:9ఎ; II. రెండవది, వైరుధ్యత వివరించబడింది, యెషయా 53:9బి; |