ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
విశ్వ పాపము, ప్రత్యేక పాపము, పాపానికి విరుగుడు (ప్రసంగము సంఖ్య 7 యెషయా 53) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము "మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవను తొలిగెను; యోహావా మనమందరి దోషమును అతని మీద మోపెను" (యెషయా 53:6). |
డాక్టర్ రిచర్డ్ లేండ్ సదరన్ బాప్టిష్టు కన్వెంక్షను ఎతిక్స్ అండ్ రెలిడియస్ లిబర్టీ కమీషన్ కు అధ్యక్షుడు. డాక్టర్ లేండ్ కు తెలుసు మనము ఒక సంస్కృతీలో బ్రతుకుచున్నామని క్రెస్తవ్యాన్ని గూర్చిన ప్రాధమిక సత్యాలు ఆశ్చర్యరీతిగా నిర్లక్షం చేస్తున్నారు. ఆయన అన్నాడు, నేను ఒక సంచిక చదివాను టైమ్ మేగజైన్ లో మతము లేని స్థితి…అమెరికాలో. ఒక జంట ఒక ఆరాధనకు హాజరు అయిన తరువాత, ఒక [సేవకుని] చూడడానికి వచ్చారు, వారు అన్నారు "మా యుక్త కుమారుడా తెలుసు కోవాలనుకుంటున్నాడు ప్లస్ గుర్తు మీద వేలాడుతున్న వ్యక్తీ ఎవరు అని." వారికి తెలియదు ఆయన యేసు అని, వారికీ తెలియదు అది సిలువ అని (“The Man on the Plus Sign,” World magazine, August 1, 2009, page 24). ఇది తేట తెల్లమవుతుంది చాలా మందికి యేసును గూర్చి చాలా తక్కువ తెలుసు అని మరియు ఆయన చేసిన దానిని గూర్చి, పొరపాటు ఎక్కడ ఉంది అంటే యేసు గూర్చి చాలా తక్కువ బోధింపబడింది మన చాలా సంఘాలలో, కాని ఒక్క గుడికి మీరు వెళ్ళలేరు ఒక్క ఆదివారము కూడా పాపులకు బదులుగా యేసు సిలువపై మరణించాడు అనే విషయము వినకుండ! యేసు సిలువపై మరణించినప్పుడు, ఆయన మన పాపములను భరించి వాటి కొరకు ప్రాయశ్చిత్తమైనాడు. ఆయన సిలువపై రక్తము కార్చాడు ప్రతి పాపము నుండి మనలను కడగడానికి. స్పర్జన్ అన్నాడు, "కొంత మంది బోధకులు యేసు క్రీస్తు రక్తమును గూర్చి బోధింపరు, నేను వారిని గూర్చి ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను - వాళ్ళ దగ్గరకు వెళ్ళవద్దు! వారు చెప్పేది వినవద్దు! ఒక సేవ రక్తము లేనిదైనచో అది ప్రాణము లేనిదే, చనిపోయిన పరిచర్చ ఎవరికీ మంచిది కాదు" (సి. హెచ్. స్పర్జన్, "క్రీస్తు రక్తము ద్వారా స్వతంత్రము", ఆగస్టు 2, 1874). క్రీస్తు మన పాపములను భరిస్తాడు అనే విషయము యెషయా 53 వ అధ్యాయములో పదే పదే కనిపిస్తుంది. "నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, వ్యసనములను వహించెను" (యెషయా 53:4). “మన అతి క్రమములను, క్రియలను బట్టి అతడు గాయబరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను” (యెషయా 53:5). “మన సమాధానార్ధమైన శిక్ష అతని మీదపడెను” (యెషయా 53:5). “అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా 53:5). “యోహావా మనమందరి దోషమును అతని మీద మోపెను" (యెషయా 53:6). “అతడు నా జనుల అతి క్రమములను బట్టి మెత్తబడెను" (యెషయా 53:8). "నీవు అతని ప్రాణమును పాపపరిహారార్ధ బలిగా చేయుదువు" (యెషయా 53:10). "నీవు జనుల దోషములను భరించెదవు" (యెషయా 53:11). "ఆయన అనేకుల పాపమును భరించెను" (యెషయా 53:12). యెషయా 53 లో మరల మరల చెప్పబడింది క్రీస్తు మన నేరారోపణను ఆయనపై వేసుకున్నాడు, మన పాపాలను బట్టి మన స్థానములో శ్రమపడి, వాటి కొరకు పూర్తి వెల చెల్లించాడు. కాని ఇప్పుడు, మన పాఠ్యములో, ఒక కొత్త అభిప్రాయము ఇవ్వబడింది. ఇక్కడ మనకు చెప్పబడింది క్రీస్తు శ్రమ పడడానికి కారణము, ఎందుకు క్రీస్తు, నిరపరాధి అయినప్పటికీ, మానవుని నేరారోపణ ఎందుకు భరించాలి. “మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవను తొలిగెను; యోహావా మన యందిరి దోషములను అతని మీద మోపెను” (యెషయా 53:6). పాఠ్య భాగము సహజముగా మూడు భాగాలుగా విభజింపబడింది. I. మొదటిది, సర్వ మానవాళి యొక్క సామాన్య పాపపు ఒప్పుకోలు. ప్రవక్త అన్నాడు, "మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి..." (యెషయా 53:6). ఇక్కడ తేటగా చెప్పబడింది సర్వ మానవాళి పాపము నిమిత్తము. "మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి." అపోస్తలుడైన పౌలు తేటుగా ఆ విషయాన్ని ఇలా చెప్పాడు, "యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరును పాపమునకు లోనైయున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసియున్నాము; ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేదు; ఒక్కడును లేదు: గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదుకు వాడెవడును లేడు" (రోమా 3:9-11). "మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి," ప్రతి ఒక్కరము! గొర్రెల వలె దేవుని న్యాయ కంచెను దాటాము, మనమందరము తప్పిపోయాము, మనమందరము దేవునికి దూరమై పోయాము. అపోస్తలుడైన పేతురు అన్నాడు, "మీరు గొర్రెల వలే దారి తప్పిపోతిరి" (I పేతురు 2:25). పేతురు వాడిన గ్రీకు పదము అర్ధము సత్యము సంరక్షణ నుండి దూరముగా వెళ్ళుట, మోసపోడానికి (బలముగా). ఇది మానవాళిని గూర్చిన వివరణ పరిశుద్ద లేఖనాలలో. "మనమందరము గొర్రెల వలే దారి తప్పిపోతిమి" (యెషయా 53:6). మానవుడు జంతువుతో పోల్చబడుచున్నాడు ఎందుకంటే పాపము అతనిని కించపరుస్తుంది - అతడు జంతువులా అయిపోతున్నాడు. కాని మనము తెలివైన జంతువుతో పోల్చబడుట లేదు. కాదు, మానవుడు సామాన్యమైన - గొర్రెతో పోల్చబడ్డాడు. మీరు ఈ పట్టణములో ఉంటారు, కనుక మీకు గొర్రెల యొక్క అవివేకమును గూర్చి ఎక్కువగా తెలియదు. కాని బైబిలు కాలములో ప్రజలకు చాలా భాగా తెలుసు గొర్రెలు ఎంత మూర్ఖమైనవో. గొర్రెల కాపరి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అవి తప్పిపోతాయి. ఒక విషయములో గొర్రెలు మంచివి - తప్పిపోవడములో! కంచెలో ఒక చిన్న రంద్రము ఉన్నా కాని, గొర్రె దానిని కనుగొని తప్పిపోతుంది. కాని, ఒకసారి గొర్రె తప్పిపోతే, తిరిగి లోపలి రాలేదు. గొర్రె సురక్షిత ప్రాంతము నుండి దూరముగా వెళ్లి తప్పిపోతాయి. మనిషి కూడా అంతే. చెడు జరిగించడంలో తెలివైనవాడు, మంచి విషయములో అవివేకి. గ్రీకు పౌరాణికములోని ఆర్గస్ వలె, పాపాన్ని వెదకడంలో మనిషి వందకళ్ళు కలిగియున్నాడు; కాని దేవుని వెదుకుట విషయములో బర్తిమయి వలె గ్రుడ్డి వారు! అపోస్తలుడైన పౌలు సార్వత్రిక జబ్బు అయిన పాపాన్ని గూర్చి ఇలా అన్నాడు, "ఆ కాలమందు ఇజ్రయెలులో సహాపౌరులు కాక, పరదేశులను, వాగ్ధాన నిబంధనలు లేని పరజనులుగా, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేని వారునైయుండి, క్రీస్తు కు దూరస్తులై యుంటారని మీరు జ్ఞాపకము చేసుకోనుడి" (ఎఫెసీయులకు 2:12). "వారైతే అంధకారమైన మనస్సు గల వారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము లోనుండి వేరు పరచబడిన వారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్ధతకు అనుసరించి నడుచుకొనుచున్నారు" (ఎఫెసీయులకు 4:18). ఈ వచనము చూపిస్తుంది మానవాళి దేవుని నుండి తప్పిపోయిందని. "మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి..." (యెషయా 53:6). ఇక్కడ, మన పాఠ్య భాగములో, సర్వ మానవాళి పాపపు ఒప్పుకోలు ఉంది. మానవ జాతి దేవుని నుండి దూరమై అబద్దపు మతముల పట్ల, సిద్దాంతాల వైపు మొగ్గు చూపి, విగ్రహాలను, అబద్దపు దేవుళ్ళను అబద్దపు క్రీస్తులను పూజిస్తున్నారు, - "వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత, దేవుని వలన కలుగు జీవము లోనుండి వేరు పరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్ధత అనుసరించి నడుచుకొనుచున్నారు" (ఎఫెసీయులకు 4:18). II. రెండవది, ప్రతి ఒక్కరి ప్రత్యేక పాపమును గూర్చిన వ్యక్తిగత ఒప్పుకోలు. పాఠ్యము కొనసాగుతుంది, "మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడు తన కిష్టమైన త్రోవకు తోలిగెను..." (యెషయా 53:6). మానవాళి పాపపు సాదారణ ఒప్పుకోలు ప్రతి వ్యక్తి ప్రత్యేక పాపపు ఒప్పుకోలుతో సమర్ధింపబడుతుంది. "మనలో ప్రతి వాడును తన కిష్టమైన త్రోవను తొలిగెను." ఏ ఒక్కడు, స్వంతంగా దైవము వైపు మరలుట లేదు. ప్రతీ వ్యక్తి "స్వంత మార్గము" ఎన్నుకుంటున్నాడు. పాప హృదయము ఇక్కడ ఉంది - మన మార్గాలు ఎన్నుకోవడం, దైవ చిత్తానికి వ్యతిరేకంగా. మన జీవితాలు మనమే నియంత్రించుకోవాలనుకుంటున్నాం. మన స్వంత ప్రణాళికలు వెంబడించాలనుకుంటున్నాం. మనము దేవునికి సమర్పించుకొము. క్రీస్తును విశ్వసించం ప్రభువుగా ఆయనకు అప్పగించుకోం. పాఠ్యము చూపిస్తుంది ప్రతి ఒక్కరికి ప్రత్యేక పాపము, "స్వంత మార్గములు" ఉన్నాయి. ప్రతీ స్త్రీ, పురుషుడు ఇతరులతో వేరుగా ఉండే పెద్ద పాపము కలిగి ఉన్నారు. ఇద్దరు పిల్లలు, అదే తల్లిదండ్రులచే పెంచబడి, వేరు అలవాటు, పరపాపాలు కలిగియున్నారు. ఒకరు తన పందాలలో పాపం చేస్తాడు, ఇంకొకరు వేరే విధంగా చేస్తాడు. "మనలో ప్రతివాడు తన కిష్టమైన త్రోవకు తోలిగెను." ఒకడు కుడికి, ఒకడు ఎడమకు తోలుగుతాడు. కాని ఇద్దరు దైవ మార్గాన్ని తిరస్కరిస్తారు. క్రీస్తు దినాలలో, సుంకరులున్నారు, దేవుని న్యాయ శాస్ర్తానికి వ్యతిరేఖంగా జీవించారు. కొంత మంది పాపులు దేవుని విడిచి శారీరక పాపాలు చేసారు. పరిశయ్యలు ఉన్నారు, స్వనీతిని గూర్చి గర్వము కలిగి, ఇతరుల కంటే వారిని మంచి వారినిగా అనుకునేవారు సద్దూ కయ్యులు కూడా ఉన్నారు. దూతలను గాని, దెయ్యాలను గాని నమ్మలేదు. శారీరక పాపాలు వారు చెయ్యలేదు. వారు సుంకరుల వలె పాపులుగా జీవించలేదు, పరిశయ్యలవలె మూఢ నమ్మకాలతో బ్రతక లేదు, కాని వారు కూడా దేవుని సత్యము విషయములో నిందితులే వారి స్వంత మార్గము ద్వారా. ఆ ప్రతి ఒక్కరిని గూర్చి ఇలా చెప్పవచ్చు, "మనలో ప్రతి వాడును తన కిష్టమైన త్రోవను తొలిగెను" (యెషయా 53:6). మీలో కొంత మంది క్రైస్తవ గృహములో పెరిగి యుండవచ్చు, కాని సువార్త వెలుగును తిరస్కరించడం ద్వారా పాపము చేసి యుండవచ్చు. ఇది "స్వంత మార్గము." ఇతరులు ఒక ప్రత్యేక పాపమును గూర్చి ఆలోచించవచ్చు. అది నీకు గుర్తు వచ్చినప్పుడు, నీవు లోతుగా భాదపడతావు. మీలో కొందరు దోషారోపణ భావనలో ఉండి క్రీస్తును విశ్వసించరు, క్షమాపణ శాంతి కనుగొనెరు. కొందరు క్రీస్తును నమ్మడాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు. "మనలో ప్రతి వాడును తన కిష్టమైన త్రోవను తొలిగెను." ఇంకో వ్యక్తి అనవచ్చు, "నా హృదయాన్ని కఠిన పర్చుకున్నాను. క్రీస్తు అవసరత ఒప్పుకోలు మునుపు కావాలనుకునేవాడిని, కాని ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రభువు ఉగ్రత ద్వారా విశ్రాంతిలో ప్రవేశించలేనని భయపడుచున్నాను. దేవుడు నన్ను వదిలేసాడని భయపడుతున్నాను." కాని మిగిలిన పాఠ్యభాగాన్ని మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మూడవ అంశము ఉంది నీకు ఇంకా నిరీ క్షణ ఉందని! III. మూడవది, ప్రత్యామ్నాయ, క్రీస్తు భరపరమరణము ఆయన ప్రజల పాపాల కొరకు. దయ చేసి లేచి నిలబడి పూర్తి వచనము చదువుదాం, ప్రత్యేక శ్రద్ధ చూపి, "యోహావా మనయందరి దోషమును అతని మీద మోపెను." "మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడు తన కిష్టమైన త్రోవకు తోలిగెను; యోహావా మనయందరి దోషమును అతని మీద మోపెను" (యెషయా 53:6). మీరు కూర్చోండి, డాక్టర్ యడ్వార్డ్ జె. యాంగ్ అన్నారు, వచనములోని మొదటి భాగము సేవకుని శ్రమలకు కారణం చూపిస్తుంది, రెండవ భాగము యోహొవాయే మన (అందరి) దోషములను ఆయనపై వేసి సేవకుని శ్రమింపచేసాడు. క్రియ ["మోపబడెను"] అనగా తీవ్రముగా మొత్తుట, మన దోషారోపణ అతి క్రమము తిరిగి మనపై మరలదు కాని [క్రీస్తును] మన [స్థానము] లో ఎదుర్కొంటుంది. తండ్రీ [దేవుడు ] మన నేరారోపణ ఆయనపై మోపాడు...మన నేరారోపణ దేవుడు ఆయనపై వేసాడు [అనగా] ఆయన మనకు ప్రత్యామ్నాయంగా మన శిక్షను భరించి పాప ఆరోపణ వహించాడు...గొర్రెల కాపరి గొర్రెల నిమిత్తము తన ప్రాణము పెట్టెను (Edward J. Young, Ph.D., The Book of Isaiah, Eerdmans, 1972, volume 3, pp. 349-350). "మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతి వాడు తన కిష్టమైన త్రోవకు తోలిగెను; యోహావా మనయందరి దోషమును అతని మీద మోపెను" (యెషయా 53:6). ఒక ప్రసంగములో "యేసుపై వేయబడిన వ్యక్తిగత పాపము," స్పర్జన్ అన్నారు, ఇవి లోతు పాపాలు, ఘోర పాపాలు. నేను వాటిని ప్రస్తావించలేను, అవి దావీదు పాపమూ కంటే చాలా వేరుగా ఉన్నాయి. నల్లని పాపాలు, వేశ్యాగమన పాపాలు, దావీదునకు సంబందించినవి; కాని దావీదు పాపాలు మనస్సే పాపాల వంటిది కావు మనస్సే పాపాలు పేతురు పాపాల వంటివి కావు - పేతురు చాలా [వేరుగా] పాపము చేసాడు; పాపాత్మురాలైన స్త్రీ ని పేతురుతో పోల్చలేము, ఆమె యొక్క గుణ శీలత ను మీరు చూస్తే మీ ఆమెను [పోల్చలేరు] లిడియాతో; మీరు లిడియాను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, మీరు ఆమెను చూడగలరా [తేడా గమనించకుండా] ఆమెను ఫిలిప్పీయురాలైన జైలరు మధ్య. వాళ్ళంతా ఒకేలా ఉంటారు, వాళ్ళంతా దారి తప్పిపోయారు, కాని వాళ్ళంతా వేరు వేరు, ప్రతి వాడు తన కిష్టమైన త్రోవకు తోలిగెను; కాని...ప్రభువు ["మన అందరి దోషములను అతని మీద మోపెను”]...నీవు ఎప్పుడైతే గొప్ప సువార్త వైద్యము దగ్గరకు వస్తావో, ప్రశస్తమైన యేసు క్రీస్తు రక్తము, అక్కడ ఉంటుంది...పాత వైద్యులు చెప్పేవారు కేతోలికాన్, సార్వత్రిక మందు ప్రతి దానికి పని చేస్తుంది...పాపాన్ని పక్కకు నెట్టేస్తుంది దోషారోపణకు పని చేస్తుంది, ఆ పాపం కొరకే తయారు చేయబడినట్లు (C. H. Spurgeon, “Individual Sin Laid on Jesus,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1977 reprint, volume XVI, pp. 213-214). క్రీస్తును విశ్వసించు. క్రీస్తుకు అర్పించుకో. ఆయనను నమ్ము నీవు ఎన్నడూ సిగ్గు నోందవు, "యోహావా మన దోషములను ఆయన మీద మోపెను." నేరారోపణ, నిస్సహాయ స్థితిలో, మనము; నీవు యేసును నమ్ముతావా? నీవు ఆయనకు సమర్పించుకుంటావా, అర్పించుకొని, విశ్వసిస్తావా? నీవు కడుగబడుతావా ఆయన రక్తము ద్వారా, తీర్పు నుండి తప్పింపబడతావా సిలువపై ఆయన ప్రత్యామ్నాయ త్యాగము ద్వారా? తండ్రీ దేవుడు క్రీస్తుపైనే ఆధారపడేలా మీకు విశ్వాసమును అనుగ్రహించును గాకా, ఆయనకు సమర్పించుకొని రక్షింపబడడానికి! మనమందరము కలిసి నిలబడుదాం. యేసును నమ్మడం విషయములో మీరు మాతో మాట్లాడాలనుకుంటే, దయచేసి నీ కుర్చీని ఇప్పుడే వదిలి ఆవరణము వెనుక వైపుకు రండి. డాక్టర్ కాగన్ ప్రశాంత గదిలోనికి మిమ్ములను తీసుకొని వెళ్లి క్రీస్తుకు సమర్పించుకోవడం విషయం పరిశుద్ద రక్తము ద్వారా కడుగబడడం గూర్చి మీతో మాట్లాడతారు! లీ గారు, దయచేసి వచ్చి స్పందించిన వారి నిమిత్తము ప్రార్ధించండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రీగ్ టాన్ ఎల్.చాన్; యెషయా 52:13-53:6. |
ద అవుట్ లైన్ ఆఫ్ విశ్వ పాపము, ప్రత్యేక పాపము, పాపానికి విరుగుడు (ప్రసంగము సంఖ్య 7 యెషయా 53) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. "మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవను తొలిగెను; యోహావా మనమందరి దోషమును అతని మీద మోపెను" (యెషయా 53:6). (యెషయా 53:4, 5, 6, 8, 10, 11, 12) I. మొదటిది, సర్వ మానవాళి యొక్క సామాన్య పాపపు ఒప్పుకోలు, యెషయా 53:6ఎ; రోమీయులకు 3:9-11; I పేతురు 2:25; ఎఫెసీయులకు 2:12; 4:18. II. రెండవది, ప్రతి ఒక్కరి ప్రత్యేక పాపమును గూర్చిన వ్యక్తిగత ఒప్పుకోలు, యెషయా 53:6బి. III. మూడవది, ప్రత్యామ్నాయ, క్రీస్తు భార పర మరణము ఆయన ప్రజల పాపాల కొరకు, యెషయా 53:6సి. |