ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రీస్తు - మానవాలిచే అవీల్యుడు (ప్రసంగము సంఖ్య 4 యెషయా 53) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము “అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను; వ్యసనా క్రాంతుడు గాను, వ్యాధిననుభవించిన వాడు గాను: మనుష్యులు చూడనోల్లని వాని గాను ఉండెను; అతడు తృణీకరింపబడిన వాడు గనుక, మనము అతని ఎన్నిక చేయకపోతిమి” (యెషయా 53:3). |
డాక్టర్ ఎడ్వర్డ్ జె. యాంగ్ అన్నారు, యెషయా ఇక్కడ కనుపరిచిన అపనమ్మకమే ఈ రోజు మన అందరితో కనుపిస్తుంది. ప్రజలు ఆహ్లాదమైన పొగడే విషయాలే [క్రీస్తు] ను గురించి చెబుతారు. వారు ఆయన నైతికతను పొగుడుతారు. ఆయన భోదలు, ఆయన మంచి వ్యక్తీ అని గొప్ప ప్రవక్త అని, ఆయనే ప్రపంచములోని నేటి సామజిక సమస్యలకు జవాబులిస్తాడని, వారు బహుశా, పాపులమని గుర్తిస్తారు, నిత్య శిక్షకు పాత్రులమని, క్రీస్తు మరణము విశిష్ట త్యాగమని, దేవుని న్యాయాన్ని జరిగించడానికి నిర్మింపబడినదని, పాపిని బాధపడిన దేవునితో సంధింపచేయడానికి, ఆయన కుమారిని సంబందించినది. దేవుడు చెప్పునది మానవులు స్వీకరించరు. ఈ రోజు, కూడా, సేవకుడైన (క్రీస్తు) మానవాలిచే తృణీకరింపబడి, తిరస్కరించబడినవాడు, మరియు మనుష్యులు ఆయన ఘన పరచరు. (ఎడ్వర్డ్ జె.యాంగ్, పి.హెచ్.డి. యెషయా గ్రంధము, విలియమ్ బి. ఎర్దమాన్స్ పబ్లిషింగ్ కంపనీ, 1972, ప్రతి 3, పేజి 344). లూథర్ అన్నాడు, యెషయా 53 వ అధ్యయము బైబిలునకు హృదయము వంటిది, ఆయన సరియేనని నేను అనుకుంటున్నాను. నీవు అది అంగీకరిస్తే, మన పాఠ్యభాగము అద్బుత ప్రముఖ్యత తెస్తుంది. నేను నమ్ముతాను, ఈ వచనము ఎంతో తేటతెల్లము బైబిలులో ఇవ్వబడిన మానవాళి అధోగతి, "అధోగతి" అనగా "అవినీతి." "పూర్తిగా" అనగా "సంపూర్ణత." మానవుడు పూర్తిగా కల్మషుడైనాడు మనతోని తల్లిదండ్రుల పాపము ద్వారా. హీడిల్ బర్గ్ కేటకిసం ఏమంటుందంటే, మానవుని స్వభావ అధోగతి "పరదైసులో మన తొలి తల్లిదండ్రులు ఆదాము హవ్వల పతనము అవిధేయత ఈ పతనము మన స్వభావాన్ని విష పూరితము చేసింది మనం జన్మ పాపులంగా - నిర్మాణత నుండి అధోగతి" (ద హీడిల్ బర్గ్ కేటకిసం, ప్రశ్న ఏడు). పూర్తి అధోగతి దేవుని పట్ల మానవుని అవిధేయత ద్వారా కనపర్చబడుతుంది, "ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది" (రోమా 8:7). ఈ అవిధేయత, దేవుని కుమారుడైన క్రీస్తు పట్ల కూడ కనపర్చబడింది. పూర్తి అధోగతి వివరిస్తుంది. ఎందుకు రోమా సైనికులు ఆయనను బదించారొనని "ఆయన మీద ఉమ్మివేసి, ఆరెల్లును తెసికొని దానితో ఆయనను తల మీద కొట్టిరి" (మత్తయి 27:30). పూర్తి అధోగతి వివరిస్తుంది ఎందుకు రోమా గవర్నరు పిలాతు "అప్పుడతడు యేసును సిలువ వేయనప్పగించెను" పూర్తి అధోగతి వివరిస్తుంది, ఎందుకు ప్రజలు ఆయన పట్ల కేకలు చేసి అవమాన పరచారు ఆయన సిలువ మీద మరణిస్తున్నప్పుడు. పూర్తి అధోగతి వివరిస్తుంది, ఎందుకు ఈ రోజు కూడ, "అతడు తృణీకరింపబడిన వాడును; ఆయన వ్యసనా క్రాంతుడు గాను, వ్యాధి ననుభవించిన వాడు గాను; మనుష్యులు చూడనోల్లని వాని గాను ఉండెను; అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయక పోతిమి" (యెషయా 53:3). I. మొదటిగా, పూర్తి అధోగతి మానవాళి క్రీస్తును నిరాకరించునట్లు చేస్తుంది. "అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను…" ఇది వివరిస్తుంది ప్రపంచంలో ఈరోజు క్రీస్తు ఎలా నిరాకరింప బడుచున్నాడో చూపిస్తుంది. ఇది మనము అమెరికా పుస్తకాలు టైమ్ మరియు న్యూస్ వీక్ క్రిస్మస్ మరియు ఈష్టర్ సమయాల్లో కవరు మీద చూస్తాము. ఈ వార్తా ప్రచురణలు ఆ సమయంలో క్రీస్తుపై ఒక కవరు కధ ప్రతి డిసెంబర్ మరియు ఏప్రిల్ లలో తయారుచేస్తాయి. కాని నేను హామీ ఇస్తాను అవి అబ్బురపరిచే కధలు కావు, వారు ఎప్పుడూ యేసు చిత్ర పటము ఎన్నుకొని పుస్తక కవరుపై వేస్తారు, అపటము క్రీస్తును వింతగా ఆధునిక మనసుకు అగుపరుస్తుంది. బహుశా ఉద్దేశ పూర్వకంగా చేస్తారు. వాళ్లకు కవరు కధ ఉంటుంది వేదాంత స్వతంత్రత ఉన్నవారిచే వ్రాయబడినవి, మనుష్యులు దేవుని అద్వితీయ కుమారుడైన క్రీస్తును తిరస్కరిస్తారు, రక్షణ కారకుని, ఈ లాంటివి బ్రిటీష్ టేబ్లోఇడ్స్ పై ప్రచురింపబడ్డాయని నేను నమ్ముచున్నాను, విశ్వ ప్రపంచములో, క్రీస్తు తరుచూ టెలివిజన్ లోను, సినిమాలలో కూడా బాహాటముగా ఎదుర్నోనబడ్డాడు. నీ సామాజిక పాఠశాలలో, లేక కళాశాలలో, విద్యార్దులుగా మీకు బాగా తెలుసు మీ అధ్యాపకులు యేసును గూర్చికాని, క్రైస్తవత్వాన్ని గూర్చి గాని మంచి మాటలు కలిగి ఉండరని, క్రీస్తు ఆయన బోధలు మీ అధ్యపకులచే నిరంతరమూ విమర్శింపబడుతూనే వచ్చాయి. "అతడు తృణీకరింపబడిన వాడును, ఆయెను" పాఠశాలలో మీ తోటి విద్యార్ధులు, ఉద్యోగ స్థలములో మీ జత పని వారు, క్రీస్తు నామము శాపగ్రస్త పదముగా ఉపయోగిస్తారు, మరియు ప్రతి రోజు ఆయనను గూర్చి చెడు మాట్లాడుతారు. "అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యులు విసర్జింపబడిన వాడును ఆయెను" (యెషయా 53:3). II. రెండవది, పూర్తి అధోగతి క్రీస్తుకు విచారము, దుఃఖము కలుగ జేస్తాయి. "అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను; వ్యసనా క్రాంతుడు గాను ఆయెను…” (యెషయా 53:3). ఏది క్రీస్తు విచారానికి, దుఃఖానికి కారణమైనది? ఏమీ కాదు, కానీ నశించి పోవు ప్రపంచము ఆయన పట్ల చూపించు తృణీకరణ తిరస్కణ! ఆయన ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు, శాస్త్రులు, పరిశయ్యలు, ప్రధాన యాజుకులు ఆయనను ఎంతగానో దూషించారు, తీవ్రంగా ఆయనను తిరస్కరించారు, ఆయన ఆత్మలో నిట్టూర్పుతో ఇలా అన్నాడు: "యెరూష లేమా, యెరూష లేమా, ప్రవక్తలను చంపుచూ, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా; కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చు కొనునో, అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని, మీ రొల్లక పోతిరి!" (లూకా 13:34). క్రీస్తు ఎంతగానో విచారముతోనూ, దుఃఖముతోనూ కుమిలి పోయాడు, మానవుని పాపముతో భారమయ్యాడు, గెత్సమనే వనములో, ఆయన సిలువ వేయబడక ముందు రాత్రి, "ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువులవలె ఆయెను" (లూకా 22:44). దేవుడు నా దోషారోవణ భరించాడు; ఏది కారణము క్రీస్తు ఆయన శరీరములో, ఆత్మలో ఈ వేదన అనుభవించడానికి, నీ పాపము కాకపొతే? ఏది కారణము ఆయన విచారానికి దుఃఖానికి, నీ స్వభావము ద్వారా వచ్చిన నీ తిరస్కృతి, శత్రు భావము కాక, దేవుని తీర్పు ఆయనపై రావడానికి, ఆయనకు తప్పనిసరి అయింది గెత్సమనే నుండి సిలువకు నీ పాపాలను మోయడానికి? చింతా క్రాంతుడు, ఏమి నామము నీ అంతరంగ స్వభావములో ఏమి ఉంది యేసుకు విచారము, దుఃఖము కలిగించేది, ఆయన దివి నుండి తొంగి నిన్ను చూస్తున్నప్పుడు? ఆయన విచారకుడు, దుఃఖాక్రాంతుడయ్యాడు, ఏ విషయమంటే, నేను నీవే ఆయనను తృణీకరించి, తిరస్కరించావు. నువ్వు అనవచ్చు ఆయనను ప్రేమిస్తున్నానని. కానీ సత్య ప్రేమ ఏమిటంటే నీవు ఆయనను నమ్మడానికి నిరాకరిస్తావు, అది నిజంగా నీవు ఆయనను తిరస్కరిస్తున్నావని కనపరుస్తుంది. నీతో నీవు నిజాయితిగా ఉండు! నీవు ఆయనను తృణీకరించి నిరాకరించకపోతే, యింకేమి కారణము ఉంటుంది నీవు ఆయనను నమ్మకుండా ఉండడానికి? ఆయనను నమ్మకుండా నీ తిరస్కృతి ఆయనకు గొప్ప దుఃఖము, విషాదము కలిగిస్తుంది ఈ సాయంకాలము. "అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను; వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధి ననుభవించిన వాడు గాను ఆయెను…" (యెషయా 53:3). III. మూడవది, పూర్తి అధోగతి మానవాళి ముఖాన్ని క్రీస్తు నుండి దాచుకోవడానికి కా రణమవుతుంది. పాఠములో మూడవ భాగము చూడండి, "మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును; వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను ఉండెను: మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను...” (యెషయా 53:3). డాక్టర్ గిల్ అన్నారు, "ఆయన నుండి మనము ముఖములు దాచుకొంటిమి; ఒక హీనమైన మరియు హేమమైన ఆయన అంటే గిట్టనట్లు, ఆయన పట్ల నిర్లక్షత ఆయనను చూడడానికి అయిష్టత, ఎలాంటి సమీక్షకూ లేని అనర్హత" (జాన్ గిల్, డి.డి., ఎన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, ద బాప్టిష్టు స్టాండర్డ్ బేరర్, 1989 రీప్రింటు, ప్రతి I, పేజీ 311-312). వారి సహజ అధోగతి స్థితిలో, మానవులు వాళ్ళ ముఖాలను క్రీస్తును దాచుకుంటారు. వారు, డాక్టర్ చెప్పినట్లు, "చెప్తారు ఆహ్లాద పొగడదగిన విషయాలు ఆయనను గూర్చి... (కాని) వారు పాపులని ఒప్పుకోరు, నిత్య శిక్షకు పాత్రులని, క్రీస్తు మరణము విశిష్ట త్యాగమని, దేవుని న్యాయానికి తగ్గట్టు నిర్మించబడ్డామని, పాపి బాధపడిన దేవునితో సమాధాన పరచబడడం, వారు పొందుకోరు దేవుడు ఆయన కుమారుని గూర్చి చెప్పిన విషయాలు" (యాంగ్, ఐబిఐడి.). క్రైస్తవవేతర మతాలు పూర్తిగా యేసును తిరస్కరించాయి, లేక ఒక "ప్రవక్త" గానో, "భోదకుని" గానో ఆయన స్థానాన్ని ఉంచుతాయి. ఇట్లు వారు నిజ క్రీస్తును తిరస్కరిస్తారు, బైబిలులో బయలుపరచబడినట్లు, తెగలు కూడ నిజ క్రీస్తును తిరస్కరిస్తారు. వారు చాదస్తపు క్రెస్తవత్వాన్ని తిరస్కరించి, నిజ క్రీస్తు స్థానములో "వేరే యేసును పెడతారు, మేము ప్రకటింపని" (2 వ కోరిందీయులకు 11:4). యేసు ప్రవచించాడు ఆయన చెప్పేటప్పుడు, "అబద్ద క్రీస్తులు లేస్తారు" (మత్తయి 24:24). ఒకే ఒక నిజ క్రీస్తు పాత కొత్త నిబంధనలో బయలుపరచబడ్డాడు. క్రీస్తును గూర్చిన మిగిలిన భావనలు "అబద్ద క్రీస్తులు" లేక అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు, "మేము ప్రకటింపని వేరే యేసు". మొర్మోనులు కూడా అబద్ద క్రీస్తును కలిగి యున్నారు. యెహవా సాక్షులు అబద్ద క్రీస్తును కలిగియున్నారు. చాలా మంది సువార్తికులు అబద్ద క్రీస్తును కలిగియున్నారు. "ఆత్మక్రీస్తు" ఈ రోజు మతపర క్రీస్తు, డాక్టర్ మైకిల్ హొర్టన్ ఆయన పుస్తకములో వివరించినట్లు, క్రైస్ట్ లెస్ క్రిష్టియానిటి (బేకర్ బుక్స్, 2008). అబద్ద క్రీస్తు నందు నమ్మిక యుంచుట ద్వారా వారు తమ ముఖములను పరిశుద్ద లేఖనాలలో బయలు పరచబడిన క్రీస్తు నుండి చాటేసుకుంటున్నారు. విచారంగా ఇది తరుచూ సువార్తిక క్రైస్తవుల మద్య నిజం. డాక్టర్ ఎ.డబ్ల్యూ. టోజర్, పేరు గాంచిన సువర్తక రచయిత, ఆ విషయాన్ని చాలా తేటగా ఇలా చెప్పాడు, మన మద్య చాల మంది (ప్రత్యామ్నాయ) క్రీస్తులు (సువార్తికులు) ఉన్నారు. జాన్ ఓవెన్, పాత పురిటాన్, ఆయన దినాలలో ప్రజలను హెచ్చరించారు; "మీరు ఊహతీత క్రీస్తును కలిగి ఉన్నారు మీరు ఊహతీత క్రీస్తుతో తృప్తి పడితే ఊహతీత రక్షణలో కూడా తృప్తి చెందాలి"... కాని నిజ క్రీస్తు ఒక్కడే ఉన్నాడు, మరియు దేవుడు చెప్పాడు ఆయన తన కుమారుడని... క్రీస్తు దైవత్వాన్ని గుర్తెరిగిన వారిలో కూడా ఆయన మానవత్వాన్ని గ్రహించని వారున్నారు. మనము త్వరగా నిర్ధారించుకుంటాం. ఆయన భూమి మీదనడిచినప్పుడు ఆయన మనస్యులలో దేవుడు, కానీ మనం ఒక సత్యాన్ని విస్మరిస్తాం, ప్రాముఖ్యమైనది, తాను ఆయన సింహాసనాసీను డైయున్నాడని (ఆకాశములో) ఆయన దేవునితో మానవుడు, నూతన నిబంధన ప్రభోధ ఏమిటంటే, ఈ క్షణమే, ఒక మనుష్యుడు ఉన్నాడా మన కొరకు దేవుని సమక్షంలో ప్రత్యక్షమైయున్నాడు. ఆయన తప్పనిసరిగా ఒక మానవుడే ఆడడము వలె, మోషె వలె, పౌలు వలె. ఆయన మహిమతో నిండిన మానవుడు, కాని ఆయన మహిమైశ్వర్యము ఆయనను మానవేతరుని చేయదు. ఈ రోజు, ఆయన నిజమైన వ్యక్తీ, మానవాళి తెగలో. మనవ హృదయ సహజ అధోగతి రక్షణ పొందని ప్రజలను నిజమైన క్రీస్తు నుండి తమ ముఖాలను దాచుకునేటట్లుగా చేస్తుంది. "మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను" (యెషయా 53:3). IV. నాలుగవది, పూర్తి అధోగతి మానవాళి క్రీస్తును కించపరిచేదిగా చేస్తుంది. పాఠ్య భాగము ఆఖరి భాగము, మూడవ వచనము. లేచి నిలబడి బిగ్గరగా చదువుదాం, ప్రారంబపు పదాలు, "ఆయన తృణీకరింపబడ్డాడు...” "తృణీకరింపబడెను, ఆయనను ఎన్నిక చేయక పోతిమి" (యెషయా 53:3). మీరు కూర్చోండి. ఈ మాటల మీద మాట్లాడాలంటే, "మనము ఆయనను ఎన్నిక చేయకపోతిమి," స్పర్జన్, "బోధకులకే రాజు," అన్నాడు, ఇది మానవ జాతి యొక్క సమిష్టి ఒప్పుకోలై ఉండాలి. అత్యుత్తమ స్థితి నుండి (అధమము) వరకు, అత్యంత ప్రతిభావంతుల నుండి నిర్లక్షింపబడిన వారి వరకు, పొగడ్తనీయుల నుండి అనామకుల వరకు, ఈ ఒప్పుకోలు తప్పని సరిగా రావాలి: "మనము ఆయనను ఎన్నిక చేయకపోతిమి"... పరిశుద్దులలో పరిశుద్దులు... వారు ఒకసారి "ఆయనను ఎన్నిక చెయ్యలేదు"... ఒక సమయములో "ఆయనను ఎన్నిక చెయ్యలేదు (వారు మార్చ బడక మునుపు)" (సి.హెచ్. స్పర్జన్, "ఎందుకు క్రీస్తు ఎన్నిక చేయబడలేదు" ద మెట్రో పోలిటన్ టేబర్నేకల్ పుల్ ఫిప్, పిల్ గ్రిమ్ పబ్లికేషన్స్, 1978 తిరుగుముద్రణ, ప్రతి LIII, పేజి 157). అదే ప్రసంగములో, పేరు, "ఎందుకు క్రీస్తు ఎన్నిక చేయబడలేదు," స్పర్జన్ నాలుగు కారణాలు యిస్తాడు ఎందుకు ఈ నశించు ప్రపంచం క్రీస్తును హర్హించడంలో తప్పిపోతుందో, ఎందుకు మారని ప్రజలు క్రీస్తు విలువను ఎందుకు చూపలేక పోవుచున్నారు, ఉన్నతంగా ఆయనను ఎందుకు ఆలోచించడం లేదు, ఎందుకు ఎన్నిక చేయడం లేదు ఆయనను ఆరాదించుట లేదు. స్పర్జన్ అన్నారు రక్షణ పొందిన ప్రజలు ఈ క్రింది నాలుగు కారణాలను బట్టి ఆయనను ఎన్నిక చేయరు: (1) మనుష్యులు క్రీస్తును విలువ యివ్వరు ఎందుకంటే తమ్మును తాము హెచ్చించుకుంటారు. "స్వఅహం" ఆయన అన్నాడు, "యేసును బయటపెట్టి...మన స్వఅహం పెరిగే కొద్ది, క్రీస్తుకు వ్యతిరేకంగా (బందిస్తాం) తలుపును. అహం పట్ల ప్రేమ రక్షకుని పట్ల ప్రేమ అడ్డుకుంటుంది." (2) మనుష్యులు క్రీస్తుకు విలువ యివ్వరు ఎందుకంటే ప్రపంచానికి ఎక్కువగా హెచ్చిస్తారు. స్పర్జన్ అన్నాడు, "ఆయనను మనం హెచ్చించం ఎందుకంటే, మనము భూమిని అందులోని సమస్తాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి." (3) మనుష్యులు క్రీస్తుకు విలువ నివ్వరు ఎందుకంటే వారు ఆయనను ఎరుగరు. స్పర్జన్ అన్నారు, "క్రీస్తును గూర్చి ఎరుగుట, క్రీస్తునే స్వయంగా ఎరుగుట మధ్య చాలా తారతమ్యము ఉంది...క్రీస్తును గూర్చి తప్పుగా ఆలోచించు వారికీ అసలు క్రీస్తును ఎరుగనే ఎరుగరు....’మనము ఆయన ఎన్నిక చేయక పోతిమి’...ఎందుకనగా మనము ఆయనను ఎరుగము." (4) మనుష్యులు క్రీస్తుకు విలువ నివ్వరు ఎందుకంటే వారు ఆత్మీయంగా మృతులు. స్పర్జన్ అన్నారు, "మనము క్రీస్తును హెచ్చింపకపోవడంలో ఆశ్చర్యము లేదు, ఎందుకంటే మనము ఆత్మీయముగా మృతులము కనుక... మన అతి క్రమములయందు, ‘పాపములయందు చచ్చిన వారమైతిమి,’ మరియు లాజరు తన సమాధిలో ఉన్నట్లు, మనము క్షణాలు గడుస్తున్న కొద్ది మరీ ఎక్కువగా మలినమవుచున్నాము.” ఈ కారణాలు స్పర్జన్ ఇచ్చాడు, మానవాళి రక్షకున్ని ఎందుకు తిరస్కరిస్తుందో అనడానికి, కారణం వారు ఆయన విలువను చూడడం లేదు. ఈ పాథ్య భాగము మీకు అన్వయింపబడుతుందా? "అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను; వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధి ననుభవించిన వాడు గాను ఆయెను: మనుష్యులు చూడ నొల్లని వాని గాను ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక, మనము అతనికి ఎన్నిక చేయక పోతిమి" (యెషయా 53:3). ఈ ప్రసంగములోని మాటలు మిమ్ములను ఆలోచింపచేస్తున్నాయా, మీ అధోగతిని గూర్చి, యేసు పట్ల మీకున్న హృదయ కాఠిన్యమును గూర్చి? మీకు కొద్ది అనుభూతి కలిగిందా మీహృదయ కల్మషమును గూర్చి, క్రీస్తును తిరస్కరించి ఆయనకు విలువ నివ్వకుండా ఉన్నావా? ఒకవేళ నీకు అలాంటి భయంకర కల్మషమును గూర్చిన భావన ఏర్పడితే, నేను నీకు నిర్ధారణ యిస్తాను, కేవలము దేవుని కృప ద్వారా అది సాధ్యపడుతుంది. జాన్ ఇలా అన్నాడు, అద్భుత కృప! మధుర స్వరము నీ కఠిన హృదయము క్రీస్తుకు వ్యతిరేకంగా ఉందని నీకు అనిపిస్తే, నీ ఘో ర అధోగతి క్రీస్తును తిరస్కరించడంలో, ఇప్పుడు నీవు ఆయనకు సమర్పణ చేసుకుంటావా? నీవు క్రీస్తును నమ్ముతావా, ఎవరినైతే లోకము తిరస్కరించి నిరాకరిస్తుందో? నీవు యేసును నమ్మితే నీవు వెను వెంటనే రక్షింపబడతావు పాపము నుండి, నరకము నుండి ఆయన రక్తము ద్వారా నీతితత్వము ద్వారా. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ |
ప్రసంగం ముందు వాక్య పఠనము కాపరిచే! యెషయా 52:13-53:3
ప్రసంగం ముందు పాట పాడినవారు బెంజమిన్ కీన్ కెయిడ్ గ్రిఫిత్:
"అమేజింగ్ గ్రేస్" (జాన్ న్యూటన్ గారిచే, 1725-1807)
ద అవుట్ లైన్ ఆఫ్ క్రీస్తు - మానవాలిచే అవీల్యుడు (ప్రసంగము సంఖ్య 4 యెషయా 53) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్ జూనియర్, గారిచే, "అతడు తృణీకరింపబడినవాడును ఆయెను; వ్యసనా క్రాంతుడు గాను, వ్యాధి ననుభవించిన వాడు గాను ఆయెను: మనుష్యులు చూడనోల్లని వాని గాను ఉండెను; అతడు తృణీకరింపబడినవాడు గనుక, మనము అతని ఎన్నిక చేయక పోతిమి" (యెషయా 53:3). (రోమా 8:7; మత్తయి 27:30, 26) I. మొదటిదిగా, పూర్తి అధోగతి మానవాళి క్రీస్తును నిరాకరించునట్లు చేస్తుంది, యెషయా 53:3ఎ. II. రెండవది, పూర్తి అధోగతి క్రీస్తుకు విచారము, దుఃఖము కలుగ జేస్తాయి, యెషయా 53:3బి; లూకా 13:34; 22:44. III. మూడవది, పూర్తి అధోగతి మానవాళి ముఖాన్ని క్రీస్తు నుండి దాచుకోవడానికి కా రణమవుతుంది, యెషయా53:3సి;
IV. నాలుగవది, పూర్తి అధోగతి మానవాళి క్రీస్తును కించపరిచేదిగా చేస్తుంది, యెషయా 53:3డి. |