ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ప్రజలచే తిరస్కరించబడిన క్రీస్తు (ప్రసంగము సంఖ్య 3 యెషయా 53) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్ జూనియర్ గారిచే. బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన యెదుట పెరిగెను: అతనికి సురూపమైనను, సొగసైనను లేదు; మనమతని చూచి, ఆపేక్షించు నట్లుగా అతని యందు సురూపము లేదు" (యెషయా 53:1-2). |
యెషయా చెప్పాడు కొంత మంది నమ్ముతారు దేవుని శ్రమపడు సేవకుని గూర్చి, మరియు కొంత మంది ఆయన కృపను అనుభవిస్తారు. అపోస్తలుడైన యోహాను యెషయా 53:1 ను ప్రస్తావించాడు. క్రీస్తు కాలములో ఉన్న ఎక్కువ మంది యూదుల అపనమ్మకము గూర్చి. "యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికీ కనబడకుండా దాగియుండెను. ఆయన వారి యెదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి: ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలు పరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నేరవేరునట్లు ఇది జరిగెను." (యెషయా 12:37-38). అపోస్తలుడైన పౌలు ఈ వచనాన్ని గూర్చి ప్రస్తావించాడు, పరలోకానికి క్రీస్తు ఆరోహణుడైన 30 సంవత్సరాల తరువాత, చూపించడానికి ఎక్కువ మంది అన్యజనులు యూదుల కంటే ఎక్కువగా ప్రభులైన యేసు క్రీస్తునకు స్పందిస్తారు. పౌలు చెప్పాడు, "యూదుడని, గ్రీసు దేశస్తుడని భేదము లేదు: ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్ధన చేయు వారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైయున్నాడు ... అయినను అందరు సువార్తకు లోబడి లేరు. ప్రభువా [యెషయా], మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?" (రోమా 10:12, 16). ప్రభువైన యేసు క్రీస్తు తానే ఆ విషయాన్ని మనకు చెప్పాడు. ఆయన అన్నాడు ఆయన యందు నమ్మిక ఉంచుతారు కొద్ది మంది మాత్రమే, "జీవమునకు పోవు ద్వారము [చిన్నది] ఇరుకును, ఆ దారి సంకుచితమునైయున్నది, దానిని కనుగొను వారు కొందరే"(మత్తయి 7:14). క్రీస్తు ఆ విషయాన్నే ప్రస్తావించాడు, ఆయన అన్నాడు, "ఆయన వారిని చూచి - ఇరుకు [చిన్న] ద్వారమున ప్రవేశింప పోరాడుడి: అనేకులు ప్రవేశింప జూతురు గాని, వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను" (లూకా 13:24). లోకములోని ప్రజలు సాదారణంగా నమ్ముతారు. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తారని, కాని యేసు దానికి సరిగ్గా విరుద్దంగా చెప్పాడు, "దానిని కనుగొను వారు కొందరే" (మత్తయి 7:14). "అనేకులు ప్రవేశింప జూతురు కాని, వారి వలన కాదు" (లూకా 13:24). ఆ కలవర పరుచు సత్యము యెషయా యొక్క విలాప విషాదంలో ప్రతి ధ్వనించింది, "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?” (యెషయా 53:1). అది అలా ఎందుకని మనం అడగవచ్చు, యూదులు గొప్ప శక్తి గల నాయకుడు, వైభవము ఐశ్వర్యము గల రాజు, వారి మెస్సియాగా, మరియు అన్య జనులు మెస్సీయా కోరికే కనిపెట్టలేదు! ఈ విధంగా మానవాళి సామాన్యంగా క్రీస్తు ఒక శ్రమపడు సేవకునిగా ఉహించలేదు, సిలువపై మరణించి వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చెల్లిస్తాడని. అపోస్తలుల కార్యములు 8 వ అధ్యాయములో, ఇతియోపీయుడైన నపుంసకుడు ఈ సత్యాలకు గ్రుడ్డివాడై యూదులలోని ప్రధాన యాజకులు పరి సయ్యుల వలే, ఆయన యెషయా గ్రంధము 53 వ అధ్యయము చదువుతూ ఉన్నాడు, ఎప్పుడైతే సువార్తికుడు ఫిలిప్పు ఆయన రధములోనికి వచ్చినప్పుడు. "ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొని పోయి, అతడు ప్రవక్తయైన యెషయా గ్రంధము [యెషయా] చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నవా? అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని…చెప్పి రధమెక్కి తనతో కూర్చుండమని, ఫిలిప్పును వేడుకొనెను" (అపోస్తలుల కార్యములు 8:30-31). ఈ నల్లవాడు యూద మతములోనికి మార్చబడ్డాడు. అతడు పాట నిబంధన లేఖనాలతో ప్రవేశము కలిగి, అయినను యూదశాస్త్రులవలె గుడ్డి వాడై యుండినాడు ఈ లేఖానాల పాఠ్యము ద్వారా వెళ్తునప్పుడు. నాకనిపిస్తుంది, ఎవరైనా ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు, మెస్సీయా వచ్చినప్పుడు, గొప్ప వానిగా ప్రసిద్దిగాంచినవానిగా ఉండడని, ఆర్భాటము మానవ మహిమలతో, కాని ఆయన వస్తాడు "విచార వ్యక్తిగా, దుఃఖాక్రాంతుడుగా," ఇలా “తృణీకరింపబడి తిరస్కరింపబడిన వ్యక్తిగా." అయినను, ఈ సత్యము బైబిలు లో సజావుగా వ్రాయబడియుంది, "ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించ లేదు" (యెషయా 1:11). ఇజ్రాయెల్ దేశము యేసును వారి మెస్సీయాగా అంగీకరించలేదు, పరిపూర్ణంగా బైబిలు ప్రవచనంలో వివరింపబడినప్పటికిని. ప్రవక్త కారణం ఇస్తున్నాడు వారు ఆయనను తిరస్కరించారు రెండవ వచనములో, "లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన యెదుట పెరిగెను: అతనికి సురూపమైనను, సొగసైనను లేదు; మనమతని చూచి, ఆపేక్షించునట్లుగా అతని యందు సురూపము లేదు" (యెషయా 53:2). కానీ మనము తీర్పు తీర్చకూడదు యూదా ప్రజలు అన్య జనులకంటే ఆయనను తీవ్రముగా తిరస్కరించారని, వారు ఎక్కువ భాగం ఆయనను నిరాకరించారు. స్పర్జన్ అన్నాడు, గుర్తుంచుకొండి యూదులను గూర్చిన సత్యము అన్యులను గూర్చిన సత్యముతో సమానము. యేసు క్రీస్తు సువార్త లోకానికి అతి సామాన్యము, కాని ఏ మానవుడు గ్రహించలేడు దేవుడు నేర్పే వరకు.... పాపము మనవాళిపై మానసిక అసమర్ధతగా మోపబడింది ఆత్మీయ విషయాలకు సంబంధించి ..... నీ సంగతి ఏంటి? నీవు కూడా గ్రుడ్డి వాడివేనా? ... నీవు కూడా గ్రుడ్డి వాడివేనా? ఓ, అదే అయితే, దేవుడు యేసు విశ్వాసము విషయములో నీకు భోదించును గాక, (సి.హెచ్.స్పర్జన్, "ఎ రూట్ అవుడ్ ఆఫ్ డ్రై గ్రౌండ్," ద మెట్రో పోలిటాన్ టేబర్నేకల్ పుల్ షిప్, పిల్ గ్రిమ్ పబ్లికేషన్స్, 1971, తిరుగు ముద్రణ, వాల్యూమ్ XVIII, పేజీలు 565-566). ఇప్పుడు, రెండవ వచనము భాగము చూద్దాం, మనము ముందు మూడు కారణాలు చూస్తాం యేసు తిరస్కరింపబడటానికి. రెండవ వచనము గట్టిగా చదవండి. "లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన యెదుట పెరిగెను: అతనికి సురూపమైనను, సొగసైనను లేదు; మనమతని చూచి, ఆపేక్షించునట్లుగా అతని యందు సురూపము లేదు" (యెషయా 53:2). I. మొదటిగా, క్రీస్తు తిరస్కరించబడ్డాడు, ఎందుకనగా మానవునికి ఆయన లేత మొక్క వలె కనిపించాడు. కొందరే యేసును నమ్మారు ఆ సత్యాన్ని బట్టి, "లేత మొక్క వలె అతడు ఆయన యెదుట పెరిగెను…" (యెషయా 53:2). లేక, డాక్టర్ గిల్ చెప్పినట్లు, "లేత మొక్క వలే, పదము కనపరుస్తున్నట్టుగా, భూమిలో మొలిచిన మొక్క వలే ... గమనిక లేదు శ్రద్ద చూపబడలేదు, ఏదియు ఆశింపబడలేదు; (భాషా లంకరము ) కనుపరుస్తుంది (తక్కువైన) (పుట్టుకలో) ఒప్పందం లేని క్రీస్తు ప్రత్యక్షత; యూడులచే ఇవ్వబడిన కారణమూ తిరస్కరింపబడి, విడిచిపెట్టబడినవాడు" (జాన్ గిల్, డి.డి., పాత నిబంధన వివరణ, ద బాప్టిష్టూ స్టాండర్డ్ బేరర్, 1989 తిరుగుముద్రణ, వాల్యూమ్ I, పేజీ 310-311). (John Gill, D.D., An Exposition of the Old Testament, The Baptist Standard Bearer, 1989 reprint, volume I, pp. 310-311). "లేత మొక్క వలె అతడు ఆయన యెదుట పెరిగెను" (యెషయా 53:2). దీని అర్ధం తండ్రి దేవుని “ముందు” క్రీస్తు జన్మించి పెద్దవాడై, అయనచే గుర్తింపబడి బలపర్చబడ్డాడు. అయినను డాక్టర్. యాంగ్ అన్నారు, "మానవులకు బహుశా, సేవకుడు (యేసు) లేత మొక్కవలె కనిపించాడు ..... మానవులు లేత మొక్కను కత్తిరిస్తారు, ఎందుకంటే వారు చెట్టు నుండి జీవాన్ని తీసేస్తారు మరియు మానవుల దృష్టిలో తీసివేయబడుట "(ఎడ్వర్డ్ జె.యాంగ్, పి.హెచ్.డి., ద బుక్ ఆఫ్ యెషయా, విలియమ్ బి. ఎర్డ్ మాన్స్ పబ్లిషింగ్, కంపనీ, 1972, వాల్యూమ్ 3, పేజీలు 341-342). (Edward J. Young, Ph.D., The Book of Isaiah, William B. Eerdmans Publishing Company, 1972, volume 3, pp. 341-342). ప్రధాన యూజుకులం పరిశయ్యలు యేసును వదిలించుకోవటానికి ఇదే కారణమూ కాదా? వారు అన్నారు, "మనమాయనను ఇలాగు చూచుచు ఊరకుండిన యెడల అందరు అయన యందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమిచు కొందురని చెప్పిరి" (యెషయా 11:48). "మానవులు లేత మొక్కను కత్తిరిస్తారు, ఎందుకంటే వారు చెట్టు నుండి జీవాన్ని తీసేస్తారు మరియు మానవుల దృష్టిలో బహిష్కరింపబడుట" (యాంగ్, ఐబిఐడి.). వారి గుర్తింపు కోల్పోతారని వారు భయపడ్డారు యూదా రాజ్యముగా వారు ఆయన యందు విశ్వాస ముంచితే. ఒక "లేత మొక్క" వలె, లేతదిగా , వారు భయపడ్డారు ఆయన "చెట్టు నుండి జీవాన్ని తీసేస్తారని" వారి దేశము యొక్క. అదే కారణముతో నీవు కూడా ఆయనను తిరస్కరిస్తున్నావు కదా? దానిని గూర్చి లోతుగా ఆలోచించు! నీ విషయములో అది నిజమే కదా - నీవు భయపడుతున్నావు నీకు ప్రాముఖ్యమైనదిగా తోచేది పోగొట్టుకుంటావని - నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయనను నమ్మితే? ఇది నిజము కాదా నీవు భయపడుచున్నవు క్రీస్తు "చెట్టు నుండి ప్రాణము తీసేస్తాడని," నీకు ఎంతో ప్రాముఖ్యమైన దానిని ఆయన దోలిచేస్తాడని? నేను డాక్టర్ కాగన్ గారిని అడిగాను ఒక వ్యాసము గూర్చిన ప్రతి కావాలని ద సాటర్ డే ఈవినింగ్ పోస్ట్ అక్టోబరు 1929. గొప్ప మనస్తత్వవేత్త డాక్టర్ ఆల్ బెర్ట్ ఐన్ స్టీన్ చే ఇవ్వబడిన ముఖాముఖి. ప్రశ్నలడిగేవాడు ఆయనను అడిగాడు, "నీవు యేసు చారిత్రాత్మక ఉనికిని అంగీకరిస్తావా?” ఐన్ స్టీన్ జవాబిచ్చాడు, "నిస్సందేహంగా . ఏ ఒక్కరు కూడా సువార్తలు చదవలేదు యేసు సన్నిది అనుభూతి పొందకుండ. ఆయన ప్రతి మాటలో విస్పష్టమవుతుంది. అలంటి జీవముతో ఏ మర్మము నింపబడలేదు." (ద సాటర్ డే ఈవినింగ్ పోస్ట్, అక్టోబరు 26, 1929, పేజీ 117). ఐన్ స్టీన్ క్రీస్తు ను గూర్చి ఉన్నత దృక్పదం కలిగి ఉన్నాడు. కాని విచారకరం ఏమంటే ఆయన ఎన్నడూ మార్చబడలేదు. ఏమి ఆయనను ఆపింది? అది తప్పకుండా జ్ఞానయుక్త సమస్య కాదు. ఐన్ స్టీన్ ఒక వ్యభిచారి, మరియు అతడు విడిచిపెట్టదలుచుకోలేదు ఆపాపాన్ని. అది అంత సామాన్యం. నువ్వు కొన్ని విషయాలు వదులుకోవాలి నిజ క్రైస్తవుడవడానికి. ఇప్పుడు, నేను అబద్ధ భోదకుడనవుతాను అది నిజము కాదని చెబితే. నేను నీకు చెబితే దేనిని ఒదులుకోకుండా క్రీస్తు వద్దకు రావచ్చని అది అబద్దపు సిద్దాంతమవుతుంది. అవును కొంత వెల అవుతుంది. యేసు నోద్దకు రావడానికి! నీ జీవితాన్నే వెలగా చెల్లించాలి! అది క్రీస్తు ఏవిధంగా తేట పరిచాడు? ఆయన అన్నాడు, "అంతట ఆయన తన శిష్యులను, జన సమూహమును, తన యొద్దకు పిలిచి -నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించు కొని తన సిలువ యెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరు వారు దానిని పోగొట్టుకొనును; నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, తన ప్రాణమును పోగొట్టు కొనువాడు వాని రక్షించు కొనును. ఒకడు సర్వ లోకమును సంపాదించు కొని, తన ప్రాణమును పోగొట్టు కొనుట వాని కేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?" (మార్కు8:34-37). అది తేటగా ఉంది, అవును కదా? క్రీస్తు నోద్దకు రావడానికి నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, స్వంత తలుపులు వదిలిపెట్టాలి, నీ స్వంత ప్రణాళికలు, నీ స్వంత ఆశయాలు, నీవు తిరిగి ఆయన యొద్దకు రావాలి. క్రీస్తును నమ్మడం అంటే అదే అర్ధము. నువ్వు ఆయనను నమ్ము - నిన్ను కాదు. నీవు ఆయనకు అప్పగించుకో నీ స్వంతతలంపులకు, గమ్యాలకు కాదు. నువ్వు నీ ప్రాణాన్ని "పోగొట్టుకుంటావు" ఆయన వైపు తిరుగుట ద్వారా, నీ ప్రాణాన్ని పోగొట్టుకొన్నప్పుడు మాత్రమే, క్రీస్తుకు సమర్పించుకొన్నప్పుడు, నీ జీవితము నిత్యత్వానికి రక్షింపబడుతుంది. ఇట్లు, మాట "లేత చెట్టు" అర్ధం దేవుని దృష్టిలో క్రీస్తు జీవమును ప్రసాదించేవాడు. కానీ ఆయన జీవితాన్ని తీసుకొనేవాడు మానవ దృష్టిలో, కాబట్టి చాల మంది ఆయనను తిరస్కరిస్తారు. అయన వారి జీవితాలు “తీసుకోడానికి"ఇష్టపడరు! వారు భయపడుతారు ప్రాణాలు అప్పగించడానికి, ఆయన యొక్క నడిపింపుకు. II. రెండవది, క్రీస్తు తిరస్కరింపబడ్డాడు ఎందుకంటే, మానవునికి ఆయన ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలె కనిపించాడు. "లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన యెదుట పెరిగెను…" (యెషయా 53:2). నా సమయము పోయింది, ఎందుకంటే మొదటి అంశము పై ఎక్కువ సమయము వెచ్చించాలి. కానీ మనము సులభంగా చూడొచ్చు ఎట్లు క్రీస్తు "ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె కనిపించాడో." డాక్టర్ యాంగ్ అన్నారు, ఎండిన నేల అధొస్థితిని సేవకుడైన (క్రీస్తు) ఎట్లు అగుపిస్తాడు విషయాలు సూచిస్తుంది. అది సూచిస్తుంది, భయంకర పరిస్థితులు వేటి మద్య సేవకుడు జీవించాడో ..... ఎండిన భూమిలో ఉన్న వేరు జీవాన్ని కాపాడుకోవడానికి కష్టపడాలి (యాంగ్, ఐబిఐడి., పేజీ 342). ఈ ప్రవచనం క్రీస్తు జనన దారిద్రతను ఎత్తి చూపుతుంది. ఆయన పెంచిన తండ్రి వడ్రంగివాడు. ఆయన నిజమైన తల్లి మరియా ఒక పేద కన్యక. పశువులశాలలో జన్మించి పేదల మద్య పెరిగాడు, "ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా." ఆయన తన జీవిత పనిని పేదల, దీనుల మద్య పెరిగాడు. ఆయన శిష్యులు కేవలము జాలరులు. అయన రాజైన హిరోద్ చే తిరస్కరించబడ్డాడు, పిలాతుచే రోము గవర్నరు, శాస్త్రులచే, పరిశయ్యలచే, "ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా." చనిపోవునంతగా హింసించి, ఆయన కాళ్ళు, చేతులను సిలువకు మేకులతో వ్రేలాడదీసారు. వారు ఆయన విడువబడిన చనిపోయిన శరీరాన్ని తీసుకున్న సమాధిలో ఉంచారు. భూమి మీద ఆయన జీవిత కాలమంతా, ఆయన శ్రమలు ఆయన మరణము, అవన్నీయు కూడా "ఎండిన భూమిలో మొలచిన మొక్కలా." కానీ, దేవునికి వందనాలు, ఆయన సమాధి నుండి మూడవ దినాన లేచారు, "ఎండిన భూమిలో మొలచిన మొక్కవలె"! ఒక లేత మొక్కవలె అకస్మాత్తుగా పెరిగి ఊహించని పెద్ద గాలి తుఫాను తరువాత, అలాగే క్రీస్తు వికసించాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు, "ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె." హల్లేలూయా! అయినను చాల మంది ఆయనయందు నమ్మికఉంచరు. ఆయన గూర్చివారు “జీవితచోదకుడుగా”, “చనిపోయిన యూదునిగా” అనుకుంటారు. "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలు పరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన యెదుట పెరిగెను…” (యెషయా 53:1-2). III. మూడవది, క్రీస్తు తిరస్కరింపబడ్డాడు, ఎందుకంటే అతనికి సరూపమైనను, సొగసైనను లేదు, ఆపేక్షించునట్లుగా, సురూపము లేదు. దయ చేసి లేచి నిలబడి రెండవ వచనము బిగ్గరగా చదువుదాం. “లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన యెదుట పెరిగెను: అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనమతని చూచి ఆపేక్షించునట్లుగా, అతని యందు సురూపము లేదు." (యెషయా 53:2). మీరు కూర్చోండి. యేసుకు “సురూపము, సొగసు లేదు, బాహ్య వైభవము, ఆర్భాటము లేదు,” డాక్టర్ యాంగ్ అన్నాడు, "సేవకుడైన (క్రీస్తు) మనము చూచినపుడు ఆపేక్షించునట్లు ఆయనలో సురూపము లేదు. మన తీర్పు వేరే మాటల్లో, భాహ్య ప్రత్యక్షతకు అది నిజము కాదు న్యాయము కాదు. ఇది విషాద చిత్రము. సేవకుడైన (క్రీస్తు) స్వజనుల మద్య సంచరించి, ఆయన వెనుక విశ్వాస దృష్టి నిజ మహిమను చూడాలి; కాని బాహ్య ప్రత్యక్షత చూసి, ఇజ్రాయెల్ అందమైనది కాని, కంటికి ఇంపైనది కాని చూడలేదు ... సేవకుడైన (క్రీస్తు) ప్రత్యక్షత ఎలా ఉందంటే, మానవుడు తప్పుడు దృక్పధముతో తీర్పు తీర్చి, పూర్తిగా తనను తప్పుడు తీర్పు తీర్చుకుంటాడు" (యాంగ్, ఐబిఐడి). బాహ్యముగా యేసుకు సౌందర్యము లేదు, గొప్ప తనము లేదు లోకాన్ని ఆకర్షించడానికి, ఎక్కువమంది ఆకట్టుకునే విషయాలు ఆయన ఇవ్వలేదు. ఆయన విజయాన్ని పేరు, ధనము లేక ఈలోక భోగాలు ఇవ్వలేదు. పూర్తిగా వ్యతిరేకము. ఆరాధన ప్రారంభంలో ప్రుదోమే లేఖనాలు చదివారు అదియే క్రీస్తు అనుగ్రహించేవి. “నన్ను వెంబడింప గోరువాడు, తన్ను తాను ఉపేక్షించు కొని తన సిలువ యెత్తికొని, నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించు కొనగోరు వారు దానిని పోగొట్టుకొనును; నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, తన ప్రాణమును పోగొట్టుకొనువాడు వాని రక్షించు కొనును. ఒకడు సర్వ లోకమును సంపాదించు కొని, తన ప్రాణమును పోగొట్టు కొనుట వాని కేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?" (మార్కు8:34-37). క్రీస్తు తన్ను తాను ఉపేక్షించుకొనుట అందించాడు. క్రీస్తు అనుగ్రహించాడు ప్రాణము మీద అధీనాన్ని కోల్పోవడం. క్రీస్తు ప్రాణ రక్షణ ఇస్తున్నాడు, పాప క్షమాపణ మరియు నిత్య జీవము. ఇవి ఆగమ్య గోచరములు, వాటిని ముట్టలేదు, చూడలేదు మానవ అనుభూతిలో చూపుతో. సహజ ఆత్మీయ విషయాలు, కాబట్టి, క్రీస్తు నిరాకరింపబడ్డాడు ఎవరి మనోనేత్రములు దేవునిచే తెరువబడలేదో, ఎందుకంటే, "ప్రకృతి సంబందియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు: అవి అతనికి వెర్రి తనముగా ఉన్నవి: అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు" (I కోరిందీయులకు 2:14). కానీ నేను ఆశ్చర్యపడుతున్నాను, ఈ ఉదయ సమయములో, దేవుడు మీ హృదయాలలో మాట్లాడుచున్నడో లేదో అని, దేవుడు మీతో ఇలా అంటున్నాడేమోనని, "మనము ఆపేక్షించునట్లుగా అతనితో సురూపము ఏమియు లేనప్పటికీనీ, అయినను నేను నిన్ను నా కుమారుని యొద్దకు చేర్చుచున్నాను. "నీ హృదయములో ఎప్పుడైనా ఈ అనుభూతి పొందవా? నీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ లోకము క్షణిక ఆనందాన్ని తప్ప దేనిని ఇవ్వలేవని క్షణిక విజయాన్ని కూడా నేవేప్పుడైనా నీ ఆత్మను గూర్చి ఆలోచన చేసావా? నీ వేప్పుడైనా ఆలోచించావా నీ నిత్యత్వము ఎక్కడ గడుపుతావో ఒక వేళ యేసు తన రక్తముతో నీ పాపాలను కడగకపోతే? ఈ విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉన్నావా? అట్లా అయితే, మామూలు విశ్వాసముతో నీవు రా ఆయన దగ్గరకు "ఆయనకు సురూపమైనను, సొగసైనను లేదు ... ఆపేక్షించునట్లుగా సౌందర్యము లేదు"? (యెషయా 53:2). నజరేయుడైన యేసు ముందు నీవు మొకాళ్ళనుతావా, నీ హృదయమంతటిలో ఆయన యందు నమ్మిక ఉంచుతావా? నీ అట్లా చెయ్యాలని నా ప్రార్ధన. మనము లేచి నిలబడితే గ్రిఫిత్ వచ్చి ప్రసంగము ముందు పాడిన రెండు వచనాలు పాడతారు. లోకాన్ని తీసుకో, కాని నాకు ఇవ్వు యేసు, దాని ఆనందాలు కానీ పేరుకే; నీ హృదయములో దేవుడు మాట్లాడినచో, ఈ గతించి పోయే లోకపు భోగాలు విడిచి పెట్టడానికి సంసిద్దుడైతే, యేసు క్రీస్తుకు అప్పగించుకోవడానికి సిద్దపడితే విశ్వాసము ద్వారా, ఆయన రక్తము ద్వారా, నీ పాపాలు కడుగబడాలనుకుంటే, ఆ విషయాలు మాతో మాట్లాడాలనుకుంటే, మీరు లేచి వెనుక భాగానికి ఇప్పుడే వస్తారా? డాక్టర్ కాగన్ ప్రశాంత ప్రదేశానికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడుతారు. మీరు వచ్చి యేసు నందలి విశ్వాసము ద్వారా రక్షింపబడాలని నా ప్రార్ధన. డాక్టర్ చాన్, దయచేసి వచ్చి స్పందించిన వారి కొరకు ప్రార్ధించండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ |
ప్రసంగం ముందు బైబిలు పఠనము ఏబెల్ ప్రుదోమే గారిచే: మార్కు 8:34-37.
ప్రసంగం ముందు పాట పాడినవారు బెంజమిన్ కీన్ కెయిడ్ గ్రిఫిత్:
"టేక్ ద వరల్డ్, బట్ గివ్ మీ జీసెస్" (ఫేనీ జె. క్రాస్ బీ, 1820-1915).
ద అవుట్ లైన్ ఆఫ్ ప్రజలచే తిరస్కరించబడిన క్రీస్తు (ప్రసంగము సంఖ్య 3 యెషయా 53) డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్ జూనియర్ గారిచే. "మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన యెదుట పెరిగెను: అతనికి సురూపమైనను, సొగసైనను లేదు; మనమతని చూచి, ఆపేక్షించు నట్లుగా అతని యందు సురూపము లేదు" (యెషయా 53:1-2). (యోహాను 12:37-38; రోమా 10:12, 16; మత్తయి 7:14; లూకా I. మొదటిగా, క్రీస్తు తిరస్కరించబడ్డాడు, ఎందుకనగా మానవునికి II. రెండవది, క్రీస్తు తిరస్కరింపబడ్డాడు ఎందుకంటే, మానవునికి ఆయన III. మూడవది, క్రీస్తు తిరస్కరింపబడ్డాడు, ఎందుకంటే అతనికి |