ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మీరు క్రీస్తు నొద్దకు వచ్చారా?HAVE YOU COME TO CHRIST? డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, నవంబర్ 9, 2003 "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). |
క్రీస్తు కాలము నాటి మత నాయకులు పాత నిబంధన లేఖనాలను జాగ్రత్తగా చదివారు. కాని లేఖనాలు క్రీస్తును గూర్చి మాట్లాడుతున్నాయి అనే వాస్తవాన్ని కోల్పోయారు – కనుక, వారు క్రీస్తు నొద్దకు రాలేదు, ఆయన ద్వారా రక్షణను పొందుకోలేదు. వారి మధ్య ఒక సామాన్య మాట ఉండేది, "ధర్మశాస్త్రపు మాటలు కలిగియున్న వాడు నిత్య జీవము కలిగియుంటాడు" (మేత్యూ హెన్రీ, యోహాను 5:39 పై గమనిక). కాని యేసు లేఖనాలు తనను గూర్చి సాక్ష్యమిస్తున్నాయని చెప్పాడు, "లేఖనముల యందు; మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించు చున్నారు: అదే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:39-40). వారు లేఖనములలోని మాటలను నమ్ముతున్నారు, కాని లేఖనములలో చెప్పబడిన క్రీస్తును వారు విశ్వసించడం లేదు. డాక్టర్ వాల్ ఊర్డ్ అన్నాడు, "అదే విధముగా ఈనాడు చాలామంది బైబిలు పఠనమే ఒక ముగింపు అనుకుంటున్నారు" (Walvoord and Zuck, The Bible Knowledge Commentary, Victor Books, 1984, volume II, p. 292). వారు బైబిలు నొద్దకు వచ్చి, బైబిలులోని మాటలు నమ్మారు – కాని వారు క్రీస్తు నొద్దకు వచ్చి ఆయనను విశ్వసించలేకపోయారు. "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). దిగజారుతున్న మానవాళిలో భయంకరమైన తీరు ఉంది క్రీస్తు దగ్గరకు కాకుండా వేరే దాని దగ్గరకు రావడం, క్రీస్తును కాకుండా వేరే దానిని నమ్మడం. "మన ముఖములను ఆయన నుండి దాచుకొని యుంటిమి" (యెషయా 53:3). "వారు నా విషయమై ఆయాస పడితిరి" (జెకర్యా 11:8). "అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము అని కేకలు వేసిరి" (యోహాను 19:15). ఈ విధముగా మానవాళి అంతా క్రీస్తును పరిగణిస్తుంది. దేవుని కృపను మినహాయించి, ఏదో విధంగా, మానవాళి అంతటిని గూర్చి ఇలా చెప్పవచ్చును, "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). దేవుని కృప లేకుండా, ఏ మానవుడు క్రీస్తు నొద్దకు రానేరడు. యేసు చెప్పాడు, "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాలేదు" (యోహాను 6:44). ఈ సాయంకాలమున దేవుడు మిమ్ములను ఆకర్షించుచున్నాడా? క్రీస్తు అవసరత ఉందని మీకు అనిపిస్తుందా? ఆయన లేకుండా మీరు నశించి పోతారు అని మీకు అనిపిస్తుందా? అలా అయితే, క్రీస్తును గూర్చిన అబద్దపు అభిప్రాయముల నుండి, దేవుడు మిమ్మును దూరముగా తీసుకొని వెళ్తున్నాడు. నేను చెప్పుచున్నది జాగ్రత్తగా వినండి, మీ తప్పుడు అభిప్రాయాలను విడిచిపెట్టి, క్రీస్తు దగ్గరకు రండి. ఇప్పటి వరకు, మీరు క్రీస్తు నొద్దకు రాలేదు. ఇప్పటి వరకు, క్రీస్తు మీతో చెప్తున్నాడు, "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). I. మొదటిది, క్రీస్తు దగ్గరకు రాకుండా ప్రజలు ఏమి చేస్తారు. పెంతెకోస్తు లేక ఆకర్షిత సంస్థల నుండి వచ్చిన వారు తరుచు రక్షణ అనుభవముల ద్వారా మరియు భావముల ద్వారా వస్తుందనుకుంటారు. "పరిశుద్ధాత్మ" తరుచు క్రీస్తు స్థానమున తీసుకొని దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉంటాడు (I తిమోతి 2:5). యేసు, వాస్తవంలో, ఆయన స్థానమును "పరిశుద్దాత్మ" తీసుకుంటుంది. "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). రోమన్ కేథలిక్ ల నుండి వచ్చు వారు ఆచార కార్యములతో యేసు స్థానమును భర్తీ చేస్తారు – వేదన, ఒప్పుకోలు, మంచి కార్యములు. వారి పాపాలను ఒక దాని తరువాత ఇంకొకటి ఒప్పుకోవడం ద్వారా, ప్రతి రోజు క్రీస్తును వెంబడించడానికి ప్రయత్నించడం ద్వారా రక్షింపబడడానికి ప్రయత్నిస్తారు. ఈ మానవ క్రియలు క్రీస్తు స్థానాన్ని తీసుకుంటాయి. "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). ఇతర ప్రపంచ మతాలు, బుద్ధిజము, హిందూయిజము, ఇస్లాము, యూదాయిజము నుండి, వచ్చిన వారు. రక్షణ అనేది క్రీస్తుపై ఆధార పడదని నమ్ముతారు. వారు క్రీస్తు "గొప్ప ప్రవక్త" అని పెదవులతో పలుకుతారు, కాని క్రీస్తు మాత్రమే వారిని రక్షింపగలడని వారు నమ్మరు. సామాన్యంగా వారు రక్షణ కొరకు "మంచి జీవితము" జీవించడంపై ఆధార పడతారు. "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). బాప్టిస్టులు సువర్తికులు కూడ క్రీస్తును తప్ప వేరే దానిని నమ్ముతూ ఉంటారు. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, లక్షలాది మంది సంఘ సభ్యులు మార్పు నొంద లేదు, దేవుని ఉగ్రత క్రింద పునరుద్దరింప బడని పాపులుగా జీవిస్తున్నారు. ఈనాడు నరకంలో లెక్కింప లేని లక్షలాది మంది...చాదస్తపు బాప్టిస్టులు ...ఉన్నారు వారు [నరకమునకు] వెళ్ళారు, నిజమైన రక్షణ లేకుండా. [వారు] దారి తప్పిపోయారు, తప్పుడు నిరీక్షణ కలిగియుండి ఇప్పుడు హింసింప బడుతున్నారు (Dr. John R. Rice, Religious But Lost, Sword of the Lord, 1939, p. 8). తరువాత డాక్టర్ రైస్ అన్నాడు, చాలాసార్లు బైబిలులో పేర్కొనబడింది, ఇది ఋజువు చేయబడినది నిజమైన ప్రమాదము దాగి ఉంది అబద్ధపు నిరీక్షణపై ఆధారపడి మోసపోయాడని, తరువాత అతడు నిత్యత్వములో నశించి పోయాడని తెలుసు కుంటాడు (ఐబిఐడి.). బాప్టిష్టులు సువర్తికులు తరుచు క్రీస్తుకు బదులు "పాపి ప్రార్ధనను" నమ్ముతారు. వారంటారు, "నన్ను రక్షించమని ఆయనను అడిగాను. అది సరిపోతుంది కదా?" లేదు, సరిపోదు! రక్షింపబడడానికి మీరు క్రీస్తు నొద్దకు రావాలి! మీ స్వంత ప్రార్ధనలు మీరు విశ్వసింపకూడదు! దైవ కుమారుని మీరు విశ్వసించాలి! ఆయనను అడగమని క్రీస్తు చెప్పలేదు. ఆయన దగ్గరకు రమ్మని చెప్పాడు. క్రీస్తు అన్నాడు, "ప్రయాసపడి భారము మోయుచున్న, సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును" (మత్తయి 11:28). ఆయన దగ్గరకు రాకుండా, ఆయనను అడగడం ద్వారా మీరు మోసపోతున్నారు! క్రీస్తు నొద్దకు రాకుండా, బైబిలు చెప్పుచున్న దానిని నమ్మడం ద్వారా మిగిలిన వారు మోసపోతున్నారు. బైబిలులోని "రక్షణ ప్రణాళిక" వారికి తెలుసు. వారి పాపముల నిమిత్తము క్రీస్తు మరణించాడని వారికి తెలుసు. ఆయన మృతులలో నుండి లేచాడని వారికి తెలుసు. వారు బైబిలు సత్యాలు నమ్ముతారు, కాని యేసు నొద్దకు, రానేరారు. డాక్టర్ వాల్ ఊర్డ్ చెప్పినట్టు, "ఈనాడు చాలా మంది బైబిలు పఠనము ముగింపు అని తలస్తున్నారు." ఆ పరిశయ్యల నుండి మీరు ఎలా వేరుగా ఉన్నారు? యేసు వారితో అన్నాడు, "లేఖనముల యందు; మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించు చున్నారు: అదే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు " (యోహాను 5:39-40). ఇప్పుడు, తరువాత, క్రీస్తు నొద్దకు రాకుండా ఈ పనులు ప్రజలు చేస్తుంటారు. అలాంటి తప్పు మీరు చేయడానికి అవకాశముందా? II. రెండవది, క్రీస్తు నొద్దకు రాకుండా చేపట్టే ఇతర మార్గాలు ఎందుకు మిమ్ములను రక్షింప నేరవు. ఆఖరి తీర్పు సమయమున, దేవుని సింహాసనము ముందు మీరు నిలబడినప్పుడు, యేసు మీతో అంటాడు, "మీరెవరో నేను ఎరుగను: అక్రమము చేయు వారులారా, మీరు నా యెద్ద నుండి తొలగి పోవుడి" (మత్తయి 7:23). ఆయన నుండి నరకాగ్నిలోనికి వెళ్లి పొండని ఆయన మీకు ఎందుకు చెప్తాడు? ఆయన "మిమ్మును ఎరుగడు" కాబట్టి. మీరు ఎన్నడు ఆయన దగ్గరకు రాలేదు కాబట్టి ఆయన మిమ్ములను ఎరుగడు! అది అంత సామాన్యమైనది! ప్రార్ధన పలుకులు పలకడం ద్వారా బైబిలులో ఉన్న దానిని కొంత నమ్మడం ద్వారా రక్షింపబడాలని మీరు ప్రయత్నించారు. ఆ విషయాలు ఎవ్వరిని రక్షింప లేదు. బైబిలు చెప్తుంది, "వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు, ఏమి చేయవలెనని, ఆయనను అడుగగా? యేసు ఆయన పంపిన వానియందు, మీరు విశ్వాసముంచుటయే, దేవుని క్రియయని వారితో చెప్పెను" (యోహాను 6:28-29). యేసు నందు నమ్మిక యుంచుట ఈ "పని" మాత్రమే అంగీకరింపదగినది! "యేసు నందు నమ్మిక యుంచుట" అనగా "యేసు నొద్దకు రావడం." "యేసు నందు నమ్మిక యుంచుట" మరియు "ఆయన యొద్దకు వచ్చుట" ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెప్పడం. యేసు చెప్పాడు, "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఎవడును నా యొద్దకు రాలేడు: అంత్య దినమున నేను వానిని లేపుదును. వారందరును దేవుని చేత బోధింప బడుదురు అని, ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి యున్నది. గనుక తండ్రి వలన, విని నేర్చుకొనిన ప్రతివాడును, నా యొద్దకు వచ్చును. దేవుని యెద్ద నుండి వచ్చినవాడు తప్ప, మరి ఎవడును, తండ్రిని చూచి యుండలేదు. ఈయనే తండ్రిని చూచి యున్నవాడు, విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు" (యోహాను 6:44-47). ఈ పాఠ్యభాగములో, మనము చూస్తాము, యేసు నొద్దకు రావడం యేసును విశ్వసించడం ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెప్పడం. ఇప్పుడు, మీకు నా ప్రశ్న ఇది – మీరు యేసు నొద్దకు వచ్చారా? మీరు ఆయనను విశ్వసించారా? యేసు నొద్దకు రావడం మాత్రమే రక్షణ ఇస్తుంది – ఎందుకంటే యేసు మాత్రమే మిమ్ములను రక్షింపగలడు! యేసు మాత్రమే మీ పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము సిలువపై మరణించాడు. యేసు మాత్రమే మీకు జీవము ఇవ్వడానికి శారీరకంగా మృతులలో నుండి లేచాడు. "మరి ఎవరి వలనను రక్షణ కలుగదు: ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనష్యులలో ఇయ్యబడిన, మరి ఏ నామమున రక్షణ పొందలేము" (అపోస్తలుల కార్యములు 4:12). మీరు యేసు నొద్దకు రావాలి లేనిచో మీరు రక్షింపబడలేరు. అన్ని ఇతర పద్ధతులు, ఇతర మార్గాలు, నరకానికి నడిపిస్తాయి. కాని ఇప్పటి వరకు మీరు ఆయన దగ్గరకు రాలేదు, అవును కదా? ఆయనను గూర్చి బైబిలు ఏమి చెప్పిందో అది మీరు నమ్మారు. మిమ్ములను రక్షింపమని కూడ ఆయనను అడిగారు. కాని మీరు ఇంకను ఆయన దగ్గరకు రాలేదు – అవును కదా? "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). III. మూడవది, మీరు క్రీస్తు నొద్దకు వచ్చారా లేదా తెలుసుకోవడం ఎలా. మీరు అనవచ్చు, "నేను క్రీస్తు దగ్గరకు వచ్చానో లేదో నాకు తెలియదు అని. నేను ఎలా చెప్పగలను?" II కొరింధీయులకు 13:5 లో ఎలా చెప్పాలో ఇవ్వబడింది. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, "మీరు విశ్వాసము గలవారై, యున్నారో; లేదో మిమ్మును మీరే శోధించు కొని చూచుకొనుడి..."(II కొరింధీయులకు 13:5). దీనిని గూర్చి, స్పర్జన్ అన్నాడు, మిమ్మును మీరు పరీక్షించుకోండి ఎందుకంటే మీరు ఒక తప్పు చేస్తే, ఈలోకములో మాత్రమే సరిదిద్దుకోగలరు...నా ఆత్మ నరకములో వేయబడడానికి నేను దైర్యము చెయ్యలేను. ఎంత భయపూరిత ఆటంకము, మీరు నేను మనలను పరీక్షించు కొనకపోతే! ఇది నిత్య ఆటంకము; పరలోకానికి లేక నరకానికి అది ఆటంకము, దేవుని నిత్య దయకు లేక నిత్య శాపమునకు. అపోస్తలుడు అన్నాడు, "మిమ్ములను మీరు పరీక్షించుకోండి" (C. H. Spurgeon, “Self Examination,” The New Park Street Pulpit, Pilgrim Publications, 1981 reprint, volume IV, p. 429). II కొరింధీయులకు 13:5 పై డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ ఇలా వ్యాఖ్యానించాడు, మనము విశ్వాసములో ఉన్నామో లేదో పరీక్షించి చూడాలని పౌలు చెప్పాడు. పరిస్థితిని ఎదుర్కొనడానికి ఇష్టపడాలి (J. Vernon McGee, Thru the Bible, Thomas Nelson, 1983, volume V, p. 145). రెండవ గొప్ప మేల్కొలుపు సువార్తికుడు, ఆషాహెల్ నేట్టల్ టన్, ఇలా అన్నాడు, [స్వ పరీక్ష] విషయంలో, ప్రతి వ్యక్తి తన్ను తానూ తీర్పు తీర్చుకోవాలి. మీ ఆత్మలతో నమ్మకంగా మెలగండి. అబద్ధపు నిరీక్షణ అన్నింటికంటే చెడ్డది. ఈ సందర్భములో తప్పు చేయడం చాలా చెడ్డ విషయము. ఏ పునాది ఆపై మీ పరలోకపు నిరీక్షణ నిలిచియుందో బాగుగా పరీక్షించుకొండి, లేనిచో చాలా ఆలస్యముగా మీ తప్పు మీరు కనుగొంటారు (Asahel Nettleton, Sermons From the Second Great Awakening, International Outreach, 1995 reprint, pp. 323, 333). మీరు వెళ్లి మీరు రక్షింపబడిన క్షణమును గూర్చి ఆలోచించండి. మీరు క్రీస్తు నొద్దకు వచ్చారా? లేక ఇంకొకటి ఏదో చేసారా? డాక్టర్ నేట్టల్ టన్ చెప్పినట్టు, "ఏ పునాదిపై మీరు పరలోకపు నిరీక్షణను కలిగియున్నారో బాగుగా పరీక్షించుకొండి." మీరు వాస్తవంగా క్రీస్తు నొద్దకు వచ్చారా? మీ నిరీక్షణకు, క్రీస్తే పునాదా? మీరు వాస్తవానికి క్రీస్తు నొద్దకు ఇప్పటి వరకు రాకపోతే, ఈ రాత్రి మీరు తప్పకుండా ఆయన దగ్గరకు రావాలి. యేసు చెప్పాడు, "నా యొద్దకు వచ్చు వానిని నేను ఏ మాత్రము త్రోసి వేయను" (యోహాను 6:37). యేసు అన్నాడు, "సమస్త భారము మోయుచున్న వారలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును" (మత్తయి 11:28). నా నిరీక్షణ యేసు రక్తము నీతిపై కట్టబడింది. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు. (ప్రసంగము ముగింపు) ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము డాక్టర్ క్రైటన్ ఎల్. చాన్: యోహాను 5:39-47. |
ద అవుట్ లైన్ ఆఫ్ మీరు క్రీస్తు నొద్దకు వచ్చారా? HAVE YOU COME TO CHRIST? డాక్టర్ జాన్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే "అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానొల్లరు" (యోహాను 5:40). (యోహాను 5:39; యెషయా 53:3; జెకర్యా 11:8; యోహాను 19:15; 6:44)
I. మొదటిది, క్రీస్తు దగ్గరకు రాకుండా ప్రజలు ఏమి చేస్తారు, I తిమోతి 2:5;
II. రెండవది, క్రీస్తు నొద్దకు రాకుండా చేపట్టే ఇతర మార్గాలు ఎందుకు మిమ్ములను రక్షింపనేరవు, మత్తయి 7:23; యోహాను 6:28-29, 44-47;
III. మూడవది, మీరు క్రీస్తు నొద్దకు వచ్చారా లేదా తెలుసుకోవడం ఎలా,
|